కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఉత్తర పరగణ జిల్లాలోని  కచువాలో ఓ దేవాలయం గోడ కూలిపోవడంతో నలుగురు మృతి చెందారు.

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా గురువారం నాడు ఉదయం వందలాది మంది ఈ దేవాలయం వద్దకు వచ్చారు.ఈ సమయంలో దేవాలయం గోడ కూలింది. గోడకూలిన సమయంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ ఘటన లోక్‌నాథ్ బాబా మందిరం వద్ద చోటు చేసుకొంది.ఈ ఘటనలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఐదుగురు తీవ్రంగా గాయపడినట్టుగా పోలీసులు తెలిపారు.