Asianet News TeluguAsianet News Telugu

ట్రిపుల్ తలాక్ బిల్లు: వచ్చే సమావేశాల్లోనైనా మోక్షం కలిగేనా?

ట్రిపుల్ తలాక్ బిల్లు విషయంలో అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరనందున వచ్చే సమావేశాల్లోనే ఈ బిల్లును పెట్టే అవకాశం కన్పిస్తోంది. ఈ మేరకు  రాజ్యసభ ఛైర్మెన్ ఈ విషయాన్ని శుక్రవారం నాడు  రాజ్యసభలో ప్రకటించారు. 

Triple Talaq Bill Deferred To Next Session Of Parliament
Author
New Delhi, First Published Aug 10, 2018, 5:02 PM IST

న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్ బిల్లు విషయంలో అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరనందున వచ్చే సమావేశాల్లోనే ఈ బిల్లును పెట్టే అవకాశం కన్పిస్తోంది. ఈ మేరకు  రాజ్యసభ ఛైర్మెన్ ఈ విషయాన్ని శుక్రవారం నాడు  రాజ్యసభలో ప్రకటించారు. అధికార, విపక్షపార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరనందున వచ్చే సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆయన ప్రకటించారు.

అయితే ట్రిపుల్ తలాక్ బిల్లు విషయంలో విపక్షాలు, అధికార పక్షానికి మధ్య ఏకాభిప్రాయం రాలేదు. అందుకే ఇవాళ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టడం లేదని ఆయన ప్రకటించారు. 

ఈ బిల్లుపై కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత రాజ్యసభకు పంపారు. అయితే  రాజ్యసభలో ఈ బిల్లుపై  విపక్షపార్టీలు పలు సవరణలు కోరుతున్నారు. 
సుమారు మూడు సవరణలను కోరుతున్నారు. అయితే ఈ విషయమై అధికార, విపక్షాలు తమ డిమాండ్ల విషయంలో పట్టు విడుపులను ప్రదర్శించడం లేదు. 

ముస్లిం మహిళల కోసం తీసుకొచ్చిన ట్రిపుల్ తలాక్‌ బిల్లు తాజా పార్లమెంట్‌ సమావేశాల్లోనూ చట్టరూపం దాల్చట్లేదు. లోక్‌సభలో ఇప్పటికే ఆమోదం పొందిన ఈ బిల్లుపై రాజ్యసభలో శుక్రవారం చర్చ జరపాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు ఈ బిల్లు చర్చకు రాలేదు. మరోవైపు పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు నేటితో ముగియనున్నందున ఈ బిల్లును వచ్చే సమావేశాలకు వాయిదా వేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం సభలో ముమ్మారు తలాక్‌పై చర్చకు పరిస్థితులు సానుకూలంగా లేవని, దీంతో ఈ రోజు దీనిపై చర్చ చేపట్టట్లేదని రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు తెలిపారు. దీంతో ఇక శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లు చర్చకు రానుంది.

ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణించేలా తీసుకొచ్చిన ముస్లిం మహిళల బిల్లు 2017 డిసెంబరు 28న లోక్‌సభలో ఆమోదం పొందింది. అయితే రాజ్యసభలో బీజేపీకి సంఖ్యాబలం లేనందున ఆమోదం పొందలేకపోయింది. దీంతో ఈ ఏడాది బడ్జెట్‌ సమావేశాల సమయంలో రాజ్యసభలో చర్చకు తీసుకురావాలని భావించినప్పటికీ అప్పుడు కూడా కుదరలేదు.

మరోవైపు ఈ బిల్లులో సవరణలు చేయాలని కాంగ్రెస్‌ మినహా ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలను సంతృప్తి పరిచేలా ఈ బిల్లులో మూడు కీలక సవరణలు చేసింది. వీటికి కేంద్ర కేబినెట్‌ గురువారం ఆమోద ముద్ర వేసింది. శుక్రవారం ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవాలని కేంద్రం భావించినప్పటికీ నేడు కూడా కుదరలేదు.

Follow Us:
Download App:
  • android
  • ios