Asianet News TeluguAsianet News Telugu

పెగాసెస్‌పై చర్చకు టీఎంసీ నోటీసు: కాసేపట్లో విపక్షాల కీలక సమావేశం

దేశంలోని పలువురు ప్రముఖుల ఫోన్లను పెగాసెస్  సాఫ్ట్ వేర్  తో  హ్కాకింగ్ చేశారనే  వార్తలపై  విపక్షాలు  కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. రాజ్యసభలో ఈ అంశంపై చర్చకు 267 రూల్ కింద టీఎంసీ నోటీసిచ్చింది.

Trinamool trains Pegasus guns on Centre lns
Author
New Delhi, First Published Jul 20, 2021, 9:31 AM IST

న్యూఢిల్లీ:  పెగాసెస్ అంశంపై  చర్చించాలని కోరుతూ టీఎంసీ  ఎంపీలు రాజ్యసభ ఛైర్మెన్ కు నోటీసులు ఇచ్చారు. 267  రూల్ కింద టీఎంసీ ఎంపీలు రాజ్యసభలో నోటీసు ఇచ్చాయి.దేశంలోని పలువురు రాజకీయపార్టీల నేతలు, కేంద్ర మంత్రులు, జర్నలిస్టుటు,  ప్రముఖుల  ఫోన్లను  ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా హ్యాకింగ్ చేసినట్టుగా మీడియాలో వార్తలు వచ్చాయి.  హ్యాకింగ్ కు గురైన ఫోన్లలో కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ సహా పలువురు రాజకీయ నేతల ఫోన్ నెంబర్లున్నాయి.

పెగాసెస్ సాఫ్ట్‌వేర్ ద్వారా  దేశంలోని పలువురి ఫోన్లను ట్యాప్ చేశారనే ఆరోపణలను కేంద్రం కొట్టిపారేసింది.  ఈ వార్తల్లో వాస్తవం లేదని తేల్చి చెప్పింది.ఈ విషయమై రాజ్యసభలో  కేంద్ర ఐటీ  శాఖ మంత్రి  రాజ్యసభలో ప్రకటన చేసే అవకాశం ఉంది.అయితే ఫోన్ ట్యాపింగ్  అంశాన్ని వదిలిపెట్టబోమని  విపక్షాలు చెబుతున్నాయి. ఈ విషయమై ఉభయసభల్లో ఏ రకమైన వ్యూహంతో ముందుకు వెళ్లాలనే దానిపై విపక్షాలు కాసేపట్లో సమావేశం కానున్నాయి. 

పెగాసెస్ అంశంపై  పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. స్వతంత్ర న్యాయ విచారణ లేదా పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేశాయి.టీఎంసీ ఎంపీ సుఖేంద్ శేఖర్ రాయ్తత పెగాసెస్ అంశంపై చర్చ కోరుతూ 267 రూల్ కింద నోటీసిచ్చారు. ఇద్దరు సిట్టింగ్ మంత్రులు, 40 మందికి పైగా జర్నలిస్టులు, ముగ్గురు విపక్ష నేతలు, సిట్టింగ్ జడ్జిలతో సహా  దేశంలోని 300కి పైగా ఫోన్ నెంబర్లను హ్యాకింగ్ కు గురైనట్టుగా మీడియాలో వార్తలు వెలువడ్డాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios