గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో బిల్కిస్‌ రేపిస్టులు సంస్కారులన్న చంద్రసింగ్ రౌల్జీకి  బీజేపీ టిక్కెట్ ఇవ్వడంపై ప్రతిపక్షలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తున్నాయి.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ క్రమంలో గోద్రా నియోజకవర్గం నుంచి బీజేపీ .. తన అభ్యర్థిగా చంద్రసింగ్ రౌల్జీని ప్రకటించింది. బిల్కిస్‌ రేపిస్టులు సంస్కారులన్న వ్యక్తులని, వారిని విడుదల చేయాలని నిర్ణయించిన ప్యానెల్‌లో రౌల్జీ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షలు పెద్ద ఎత్తున్న విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆయన ఈ స్థానం నుంచి వరుసగా ఆరుసార్లు గెలుస్తూ వస్తున్నారు. 

ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ ఎంపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకురాలు మహువా మొయిత్రా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రసింగ్ రౌల్జీకి మళ్లీ టిక్కెట్ ఇచ్చినందుకు బిజెపిని దుయ్యబట్టారు. 
ప్రధాని మోదీ సహా బీజేపీ నాయకులు అంటున్న ‘గుజరాత్‌ మాడల్‌’ ఇదేనా? అని ప్రశ్నించారు. ఇది గుజరాత్ మోడల్ అని, రేపిస్టులు, హంతకులను 'సంస్కారీ' అని పిలిచే వారికి టిక్కెట్లు ఇస్తున్నారని అన్నారు. ద్వేషం , హత్యలను ప్రోత్సహించే వారికి ప్రతిఫలం లభిస్తుంది. బిలికిస్ బానో కేసులో దోషుల విడుదలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్లలో మహువా మోయిత్రా ఒకరు.

నిందితుల విడుదలపై గుజరాత్ ప్రభుత్వం నిర్ణయం

బిలికిస్ బానోపై అత్యాచారం, ఆమె కుటుంబ సభ్యులను హత్య చేసిన కేసులో 11 మంది నిందితులకు జీవిత ఖైదు పడింది. అయితే.. మంచి ప్రవర్తనతో 15 ఏళ్ల జైలు శిక్ష తర్వాత వారిని ఆగస్టు 15న విడుదల చేసింది గుజరాత్ ప్రభుత్వం. ఈ కేసులో 11 మందిని విడుదల చేయాలని నిర్ణయించిన ప్యానెల్‌లో గోద్రా ఎమ్మెల్యే, మాజీ మంత్రి చంద్రసింగ్ రౌల్జీ కూడా ఉన్నారు. అలాగే ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బిలికిస్ కేసులో నిందితులను సంస్కారవంతులైన బ్రాహ్మణులని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చర్చనీయంగా మారాయి.

కాంగ్రెస్‌ను వీడి బీజేపీలోకి 

2017లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు చంద్రసింగ్ రౌల్జీ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. బీజేపీ టిక్కెట్టు నుంచి కూడా విజయం సాధించారు. గతంలో 2007, 2012లో కూడా ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఆయన ఈ స్థానం నుంచి వరుసగా ఆరుసార్లు గెలుస్తూ వస్తున్నారు. అయితే, కాంగ్రెస్‌ను వీడిన తర్వాత గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు మార్జిన్ 300 లోపే ఉంది.