తాజాగా కోవిడ్ తో మరణించిన తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి భార్య ఎన్నికల సంఘంపై హత్య కేసు పెట్టింది. ఖార్దాకు చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాజల్ సిన్హా ఏప్రిల్ 25 న కోవిడ్ తో మరణించారు. 

అయితే దీనిమీద అతని భార్య నందితా సిన్హా మాట్లాడుతూ.. నా భర్త, తనలాంటి అనేక మంది అభ్యర్థుల మరణాలకు డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ సుదీప్ జైన్, ఇతర అధికారుల అజాగ్రత్త, నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు.

కమిషన్  సెల్ఫ్ సర్వీసింగ్, బైండ్ మోటివ్స్ ను నందితా సిన్హా తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు నందితా సిన్హా, పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో, దేశం మొత్తం "కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి పోరాటం చేస్తోంది" అన్నారు. కాగా బెంగాల్ లో ఎనిమిదిదశల ఎన్నికల పోలింగ్ మార్చి 27 నుండి ఏప్రిల్ 29 వరకు నిర్వహించడానికి ఈసీ నిర్ణయించింది. 

"బెంగాల్ లో పోల్చితే తమిళనాడు, కేరళ, పాండిచేరిల్లో ఎన్నికలు ఒకే దశలో ఒకే రోజులో  పూర్తయ్యాయి. ఇక అస్సాంలో మూడు రోజుల వ్యవధిలో మూడు దశల్లో ఓటింగ్ జరిగింది" అన్నారు. అంతేకాదు  రాష్ట్రంలో "కోవిడ్ కేసుల తీవ్రతను" పేర్కొంటూ మిగిలిన దశ ఎన్నికలను క్లబ్ చేయాలని తృణమూల్ కాంగ్రెస్ ఏప్రిల్ 16, 20తేదీల్లో రెండుసార్లు ఎన్నికల కమిషన్ను కోరినా వారు పట్టించుకోలేదని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

దేశంలో విస్తరిస్తున్న కరోనా.. ఒక్కరోజే నాలుగు లక్షలకు చేరువలో కొత్త కేసులు.. 3,645 మంది మృతి......

 "రాత్రి 7 గంటల తరువాత ప్రచారాన్ని నిషేధించడం,  24గంటల నుంచి 72గంటల వరకు సైలెంట్ పీరియడ్ ను పొడిగించడం లాంటి పిచ్చి వ్యవహారాలతో పనికిరాని భద్రత చర్యలు అని సమాధానం ఇస్తోంది" అన్నారామె.

కలకత్తా హైకోర్టు దీనిమీద అలర్ట్ చేసినప్పటికీ కమిషన్ ముంచుకొస్తున్న మహమ్మారి విషయంలో ఉన్న అన్ని ఆధారాలను ఉద్దేశపూర్వకంగా మరిచిపోయింది" అన్నారామె. 

ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించడం మీద కమిషన్ పై మద్రాస్ హైకోర్టు తీవ్రంగా విరుచుకుపడ్డ రెండురోజుల్లో నందిత సిన్హా ఫిర్యాదు ప్రాధాన్యత సంతరించుకుంది. 

కోవిడ్ సెకండ్ వేవ్ కి ఎన్నికల కమిషన్ ఒక్కటే పూర్తి బాధ్యత అని సోమవారం కోర్టు పేర్కొంది. "మీ అధికారులపై హత్య ఆరోపణలపై కేసు పెట్టాలి" అని న్యాయమూర్తులు అన్నారు.

ఈ నేపథ్యంలో కోవిడ్ సేఫ్టీ మెజర్స్ తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వాల పని, ఎన్నికల కమిషన్  పని కాదని కమిషన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాదు ఎన్నికల కమిషన్ స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన, సురక్షితమైన ఎన్నికలను నిర్వహించేలా మాత్రమే బాధ్యత వహిస్తుందని పోల్ బాడీ తెలిపింది.

ఎన్నికల సమయంలో బెంగాల్ లో శాంతి భద్రతల పేరుతో కేంద్ర పారామిలిటరీ దళాలను దించారని వీరు ఎన్నికల కమిషన్ నియంత్రణలో ఉన్నారని.. తలుచుకుంటే ఈసీ కోవిడ్ ప్రోటోకాల్‌ సరిగా ఉండేలా చూడగలిగేవారని.. తన ఫిర్యాదులో నందిత సిన్హా అభిప్రాయపడ్డారు.

లెక్కింపు కేంద్రాల్లో ప్రవేశించాలంటే.. కొవిడ్ నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరి.. : ఈసీ...

అంతకుముందు కలకత్తా హైకోర్టు ఎన్నికల కమిషన్‌ను ఇదే తరహాలో అభిశంసించింది. "ఎన్నికల కమిషన్ కు అధికారం ఉంది, కానీ ఈ కోవిడ్ కాలంలో ఎన్నికల గురించి ఏం చేస్తోంది? ఈసీ కేవలం సర్క్యులర్లను పాస్ చేస్తోంది. ప్రజలకు వదిలివేస్తోంది. అయితే ఈసీ తన అధికారాన్ని అమలు చేస్తుంది" అని కోర్టు తెలిపింది.

బెంగాల్ లో ఎనిమిద దశల పోలింగ్ అనే అపూర్వమైన ఈసీ ఆలోచననలు టీఎంసీ తీవ్రంగా విమర్శించింది. రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని భావిస్తున్న బిజెపికి కమిషన్ ఈ విధంగా సాయం చేస్తోందని కూడా ఆరోపించింది.

ఎన్నికలను ప్రకటించినప్పుడు హింస జరుగుతుంది అనే ఆందోళనలు బిజెపి, కమిషన్ బాగా వినిపించాయి. అదే సమయంలో ప్రజల భద్రత ను మరిచాయన్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల తరువాత సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారని చెప్పారు.

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం.  #ANCares #IndiaFightsCorona