Asianet News TeluguAsianet News Telugu

శ్రీన‌గ‌ర్ లాల్ చౌక్ లో ఎగిరిన త్రివ‌ర్ణ ప‌తాకం

జ‌మ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌లోని భార‌త త్రివ‌ర్ణ ప‌తాకం మొద‌టి సారిగా రెప‌రెప‌లాడింది. 73వ గ‌ణ‌తంత్ర వేడుక‌ల సంద‌ర్భంగా స్థానిక క్లాక్ ట‌వ‌ర్ వ‌ద్ద ఇద్ద‌రు వ్య‌క్తులు సాజిద్ యూసుఫ్ షా, సాహిల్ బషీర్ భట్ లు జాతీయ జెండాను బుధ‌వారం ఆవిష్క‌రించారు. 

Tricolor flying at Lal Chowk, Srinagar
Author
Lal Chowk, First Published Jan 26, 2022, 3:40 PM IST

జ‌మ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌లోని భార‌త త్రివ‌ర్ణ ప‌తాకం మొద‌టి సారిగా రెప‌రెప‌లాడింది. 73వ గ‌ణ‌తంత్ర వేడుక‌ల సంద‌ర్భంగా స్థానిక క్లాక్ ట‌వ‌ర్ వ‌ద్ద ఇద్ద‌రు వ్య‌క్తులు సాజిద్ యూసుఫ్ షా, సాహిల్ బషీర్ భట్ లు జాతీయ జెండాను బుధ‌వారం ఆవిష్క‌రించారు. స్వాతంత్య్రానంతర భారతదేశంలో అనేక దశాబ్దాల తర్వాత శ్రీనగర్‌లోని ఘంటా ఘర్‌పై త్రివర్ణ పతాకం స‌గ‌ర్వంగా ఎగిరింది. 

గ‌తంలో ఇదే ప్రాంతంలో జనవరి 26వ తేదీన‌ పాకిస్తాన్ జెండాను ఎగుర వేసేవారు. లేక‌పోతే ఈ రోజు 144 సెక్ష‌న్ విధించేవారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత కూడా ఈ ప్రాంతంలో జెండా ఎగుర‌వేయ‌లేదు. సున్నిత‌మైన ప్రాంతంగా పేర్కొంటూ శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌లో తిరంగ జెండాను ఎగురు వేసేందుకు అనుమ‌తి ఇవ్వ‌లేదు. 

‘‘లాల్ చౌక్‌లో జెండాను ఎగురవేసే అవకాశం మాకు లభించింది. ఆర్టికల్ 370ని రద్దు చేసిన వారికే ఈ గుర్తింపు, ప్ర‌శంస‌లు ద‌క్కుతాయి. చరిత్రలో మొదటిసారిగా మేము భారతదేశంలో ఉన్నామని భావిస్తున్నాము’’ అని జెండా ఎగురవేసిన వ్యక్తుల్లో ఒకరైన సాజిద్ యూసుఫ్ అన్నారు. ఆయ‌నతో పాటు వ‌చ్చిన మ‌రో వ్య‌క్తి సాహిల్ బషీర్ భట్ ‘‘చరిత్రను మార్చడానికి ప్రయత్నిస్తున్నప్పుడు భావోద్వేగాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంతకుముందు పాకిస్తాన్ దొంగలు ఇక్కడికి వచ్చి లాల్ చౌక్‌లోని క్లాక్ టవర్‌పై పాకిస్తాన్ జెండాను ప్రదర్శించేవారు. కానీ మేం ఈరోజు భార‌త జాతీయ జెండా ఎగుర‌వేశాం. ఈరోజు ఇద్ద‌రం, రేపు ఇర‌వై మంది, త‌రువాత రెండు వంద‌ల మంది వ‌స్తారు’’ అని ఆయ‌న అన్నారు. 

శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌కు దేశంలోనే ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉంది. 1948లో ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలనే పాకిస్థాన్ ప్రయత్నాన్ని భారత్  నిలువ‌రించింది. ఆ త‌రువాత భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ భారత జాతీయ జెండాను ఎగురవేసిన ప్రదేశం ఇది. అప్ప‌టి వ‌ర‌కు ప్ర‌త్యేక సంస్థానంగా ఉన్న జ‌మ్మూ కాశ్మీర్ త‌రువాత భార‌త‌దేశంలో క‌లిసి పోయింది. త‌రువాత చాలా సంద‌ర్భంగాల్లో ఇక్క‌డ జాతీయ జెండా ఎగుర‌లేదు. క్లాక్ టవర్ కూడా శిథిలావస్థకు చేరుకుంది. 2019 ఆగస్టులో కేంద్ర ప్ర‌భుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసింది. దీంతో అప్ప‌టి వ‌ర‌కు జ‌మ్మూ కాశ్మీర్ కు ఉన్న ప్ర‌త్యేక ప్ర‌తిప‌త్తి ర‌ద్దు అయ్యింది. 

ఇదిలా ఉండ‌గా.. భారతదేశ‌ 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంద‌ర్భంగా జ‌మ్మూ కాశ్మీర్ లో ఎలాంటి ఘ‌ట‌న‌లూ జ‌ర‌గ‌కుండా ఉండేందుకు ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు. శాంతియుతంగా గ‌ణ‌తంత్ర వేడుకలు సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios