Asianet News TeluguAsianet News Telugu

Tribal Woman Beaten: గ్రామస్తుల దాష్టీకం.. చితకబాది.. చెప్పుల దండ వేసి.. భర్తని భుజాలపై మోసుకెళ్లాల‌ని శిక్ష!

Tribal Woman Beaten: మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాలో ఓ గిరిజ‌న మ‌హిళ‌కు ఘోర‌ అవమానం జ‌రిగింది. గిరిజన మహిళ మెడ‌లో  చెప్పుల దండ వేసి.. విచ‌క్ష‌ణ ర‌హితంగా కొట్టి, బలవంతంగా తన భుజాలపై త‌న భ‌ర్తను మోసుకెళ్లాల‌ని శిక్షించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Tribal Woman Beaten Paraded And Forced To Carry Her Husband in MP  
Author
First Published Jul 5, 2022, 4:47 AM IST

Tribal Woman Beaten: మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాలో అవమానకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ గిరిజన మహిళ మెడ‌లో  చెప్పుల దండ వేసి.. విచ‌క్ష‌ణ ర‌హితంగా కొట్టి, బలవంతంగా తన భుజాలపై త‌న భ‌ర్తను మోసుకెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ  వీడియోలో కొంతమంది పురుషులు మహిళను కొట్టడం చూడవచ్చు. ఆ మహిళకు వేరే వ్యక్తితో సంబంధముందని ఆరోప‌ణ‌తో ఇలా శిక్షించారు.

పోలీసుల కథనం ప్రకారం..  మధ్యప్రదేశ్‌లోని దివాస్‌ జిల్లాకు చెందిన ఓ గిరిజన మహిళను గ్రామస్తులు తీవ్రంగా కొట్టారు. అనంతరం ఆమె మెడలో చెప్పుల దండ వేశారు. అనంత‌రం.. ఆమె త‌న భర్తను భుజాలపై కూర్చోబెట్టుకుని ఊరంతా తిరిగింది. ఇంత దారుణంగా శిక్షించ‌డానికి కార‌ణం.. స‌ద‌రు మ‌హిళ నాలుగైదు రోజులు కనిపించకుండా పోయిందట‌. ఈ క్ర‌మంలో ఆమె  వేరే వ్యక్తితో అక్ర‌మ సంబంధాన్ని పెట్టుకున్న‌ట్టు  గుర్తించినట్టు భర్త, గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.  అనుమానంతో ఆమెను తీవ్రంగా హింసించారు. 

పోలీసుల నివేదికల ప్రకారం బాధితురాలి భర్తతో సహా తొమ్మిది మంది వ్యక్తులను అరెస్టు చేశారు. దాడి చేయడం, అల్లర్లు చేయడం, ఒక మహిళ యొక్క నమ్రతను దౌర్జన్యం చేయడం, నేరపూరిత బెదిరింపులకు పాల్పడినందుకు కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఆదివారం జరిగినప్పటికీ సోమవారం వెలుగులోకి వచ్చింది.

తనకు 15 ఏళ్ల‌ వయసులోనే పెళ్లి చేశారని, అప్పటి నుంచి తన భర్త చిత్రహింసలకు గురి చేస్తుండే వాడ‌నీ  బాధితురాలు వాపోయింది. త‌న భర్త పెట్టే..బాధ‌లు త‌ట్టు కోలేక త‌న‌ స్నేహితుడి ఇంట్లో తలదాచుకున్నానని, తాను ఏ తప్పూ చేయలేదని తెలిపింది.

ఈ ఘ‌ట‌న‌పై  దేవాస్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సూర్యకాంత్ శర్మ మాట్లాడుతూ.. “మహిళ వారం క్రితం తప్పిపోయింది. ఆమె భర్త కనిపించడం లేదని ఉదయ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇటీవల, ఆ మహిళ తన సన్నిహితుడిగా చెప్పుకునే వ్యక్తి ఇంట్లో నివసిస్తోందని అతనికి తెలిసింది. మహిళ భర్త ఇంటికి చేరుకుని గ్రామస్థుల ఎదుట ఆమెను బయటకు లాగాడు. తరువాత, ఆమెను దారుణంగా కొట్టారు. గ్రామస్తులు ఆమెను బూట్ల దండ వేయమని బలవంతం చేసి, తన భర్తను తీసుకువెళ్లమని బలవంతం చేశారు. నలుగురు గ్రామస్తులు ఆ మహిళకు భర్తను ఎత్తుకుని గ్రామంలో నడవడానికి సహాయం చేశారు” అని శర్మ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios