న్యూఢిల్లీ: ఢిల్లీలో శుక్రవారం సాయంత్రం భూకంపం సంభవించింది. ఢిల్లీతో పాటు ఉత్తర భారతంలో కూడ పలు చోట్ల భూ ప్రకంపనలు చోటు చేసుకొన్నాయి.

ఢిల్లీతో పాటు శ్రీనగర్, మధుర, చంఢీఘడ్‌లలో కూడ భూప్రకంపనలు చోటు చేసుకొన్నట్టుగా  అధికారులు తెలిపారు.  అంతేకాదు ఉత్తర భారతంలో కూడ పలు చోట్ల భూప్రకంపనలు చోటు చేసుకొన్నట్టుగా సమాచారం.

ఆఫ్ఘనిస్తాన్ లో శుక్రవారం నాడు సాయంత్రం 5:09 గంటలకు భూకంపం వాటిల్లింది. ఆ తర్వాత ఢిల్లీలో సాయంత్రం భూకంపం వచ్చింది.  ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపతీవ్రత నమోదైంది.