Asianet News TeluguAsianet News Telugu

పాలలో ఉండే ప్రోటీన్ తో ఎయిడ్స్ కు చికిత్స.. పేటెంట్ పొందిన హెచ్ సీయూ..

పాలలోని ఓ ప్రోటిన్ తో ఎయిడ్స్ ను నియంత్రణలో ఉంచవచ్చని హెచ్ సీయూకి చెందిన ప్రొఫెసర్ అధ్యయనం చేశారు. దీనిపై ఇప్పటికే ఆయన  ఆధ్వర్యంలో బృందం పేటెంట్ పొందింది. 

Treatment for AIDS with Protein in Milk .. Patented HCU ..
Author
Hyderabad, First Published Dec 11, 2021, 1:01 PM IST

ఎయిడ్స్.. మనిషి రోగ నిరోదక శక్తిని క్షీణింపజేసి మనిషి తీవ్ర అనారోగ్యం పాలయ్యేలా చేస్తుంది. అయితే ఈ ఎయిడ్స్ పూర్తిగా న‌యం చేసే చికిత్స ఇంత వ‌ర‌కు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఎయిడ్స్‌ను కేవ‌లం నియంత్ర‌ణ‌లో ఉంచుకోవ‌చ్చు. ఎయిడ్స్ స‌మ‌ర్థ‌వంతంగా న‌యం చేసేందుకు శాస్త్ర‌జ్ఞులు ప‌రిశోధ‌న‌లు జ‌రుపుతూనే ఉంటారు. ఈ క్ర‌మంలో ఈ వ్యాధికి మెరుగైన చికిత్స‌లు అందుబాటులోకి వ‌స్తున్నాయి. అయితే ఇప్పుడు ఎయిడ్స్‌ను మ‌రింత సుల‌భంగా ఎదుర్కొనేందుకు హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ కొత్త అధ్య‌యనం చేసింది. దీనిపై ఇప్ప‌టికే పేటెంట్ పొంది..

పాల‌లోని ప్రోటీన్‌తో..
పాల‌లో లాక్టోఫెర్రిన్ అనే ప్రొటీన్ ఉంటుంది. దీని ద్వారా ఎయిడ్స్‌ను నియంత్రించ‌వ‌చ్చ‌ని హెచ్‌సీయూకి ఫ్రొఫెస‌ర్ ఒక‌రు నిరూపించారు. లాక్టోఫెర్రిన్‌తో చికిత్స అందించే విధానంపై ఇప్పటికే ఆయ‌న ఇంట‌లెక్చువ‌ల్ ప్రాప‌ర్టీ ఇండియా నుంచిపేటెంట్ రైట్స్ పొందారు. ఆ ప‌రిశోధ‌న‌ను మ‌రింత మెరుగుప‌రిచి వైద్య విధానంలో ఉప‌యోగించేందుకు హెచ్‌సీయూలోని బ‌యోటెక్నాలజీ, బ‌యో ఇన్ఫ‌ర్మేష‌న్ డిపార్ట్‌మెంట్ కు చెందిన ప్రొఫెస‌ర్ కొండేపి ఆనంద్ ఆధ్వ‌ర్యంలో ప‌రిశోధ‌న కొన‌సాగుతోంది. పాల‌లో ఉండే లాక్టోఫెర్రిక్ నానో పార్టిక‌ల్స్ ద్వారా చికిత్స అందించవ‌చ్చ‌ని ఆయ‌న తెలిపారు.ఈ వైద్య విధానం ఉప‌యోగించ‌డం వ‌ల్ల మిగిలిన ఔష‌దాలు కూడా సమ‌ర్థ‌వంతంగా ప‌ని చేస్తాయ‌ని చెప్పారు. 

భారత్‌లో మరో ఒమిక్రాన్ కేసు నమోదు.. మొత్తం కేసులు ఎంతకు చేరాయంటే..?
హెచ్ఐవీ వైరస్‌ను ఆఫ్రికా ఖండంలో గుర్తించారు. త‌రువాత ఇప్పుడు అది అన్ని దేశాల్లోనూ విస్త‌రించి ఉంది. హెచ్ఐవీ సోకిన వ్య‌క్తి నుంచి  ర‌క్తం సేక‌రించ‌డం, లేదా వారితో లైంగిక చర్య‌ల్లో పాల్గొన‌డం వ‌ల్ల ఇది ఇత‌రుల‌కు వ్యాపిస్తుంది. ఎయిడ్స్ బాధితుల‌లో ఆఫ్రికా ఖండం మొద‌టి స్థానంలో ఉంది. త‌రువాత భార‌తదేశంలోనే అత్య‌ధిక ఎయిడ్స్ కేసులు ఉన్నాయి. ఎయిడ్స్ అనేది ఒకే వ్యాధి కాదు. ఇది వైర‌స్‌ల స‌మాహం. హెచ్ఐవీ అనేది ఎందుకంత ప్ర‌మాదం అంటే ఈ వైర‌స్ మ‌నిషి రోగ నిరోధ‌క శ‌క్తిపై మొద‌ట ప‌ని చేస్తుంది. మ‌నిషికి రోగ నిరోద‌క శ‌క్తి త‌గ్గిపోతే చిన్న చిన్న రోగాలు కూడా ఇబ్బంది పెడ‌తాయి. జ‌లుబు లాంటి చిన్న వ్యాధుల‌ను కూడా త‌ట్టుకోలేరు. దీంతో మ‌నిషి అనారోగ్యం పాలై చ‌నిపోతాడు. ఈ వ్యాధి సోకినప్పుడు తొంద‌ర‌గా తెలియ‌దు. 5-6 సంవ‌త్సరాల త‌రువాత ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. ఈ వ్యాధిని పూర్తిగా న‌యం చేయ‌లేకపోయినా.. నియంత్ర‌ణ‌లో ఉంచుకోవ‌చ్చు. మెరుగైన జీవ‌న విధానం అవ‌లంభించ‌డం, మంచి ఆహారం తీసుకువ‌డం, శారీర‌క శ్ర‌మ చేయ‌డం వ‌ల్ల ఎయిడ్స్‌ను అదుపులో ఉంచుకోవ‌చ్చు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios