PM Modi: 2014 కి ముందు కాంగ్రెస్ పాలనలో దేశం అవినీతి, కుంభకోణాల్లో చిక్కుకుంద‌నీ, బందుప్రీతితో దేశం తీవ్రంగా నష్టపోయిందని ప్రధాని మోడీ అన్నారు. పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీంను ఆయన సోమవారం వర్చువల్ గా ప్రారంభించారు. 

PM Modi: భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిదో సంవత్సరం పూర్తి చేసుకున్నది. ఈ సందర్భంలో ప్రధాని నరేంద్ర మోడీ సోమ‌వారం ఓ కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. 2014 కి ముందు కాంగ్రెస్ పాలనలో దేశం అవినీతి, కుంభకోణాల్లో చిక్కుకుందనీ, బంధుప్రీతితో దేశం తీవ్రంగా న‌ష్ట‌పోయింద‌ని విమ‌ర్శించారు. కానీ.. నేడు భార‌త్ ప్ర‌పంచ దేశాల‌కు ఆద‌ర్శంగా నిలిచిందనీ, అనేక‌ నూత‌న‌ శిఖరాలకు అధిరోహించింద‌ని అన్నారు. పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ ప్రోగ్రామ్ ( PM CARES for children Scheme) కార్య‌క్ర‌మాన్ని సోమవారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. అనంతరం ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ.. నేడు బీజేపీ ప్ర‌భుత్వం ఎనిమిదేళ్ల పూర్తి చేసుకుందనీ, బీజేపీ ప్ర‌భుత్వంపై దేశ ప్ర‌జలకు అపార‌ విశ్వాసంఉందనీ అన్నారు. 2014కు ముందు దేశంలో అవినీతి, బిలియన్ డాలర్ల స్కామ్ లు, బంధుప్రీతి, ఉగ్రవాద సంస్థలు, ప్రాంతీయ వివక్షలు అనే విష‌వ‌ల‌యంలో చిక్కుకుని ఉండేద‌ని.. నేడు ఈ విష‌వ‌ల‌యాల‌ను నుంచి దేశాన్ని బీజేపీ ప్ర‌భుత్వం బ‌య‌ట‌ప‌డేసింద‌ని PM Modi అన్నారు.

గత ఎనిమిదేళ్లలో భారత్ అనేక ఉన్న‌త శిఖ‌రాల‌ను చేరుకుంద‌నీ, ఈ ప‌రిణామాన్నిఎవరూ ఊహించలేద‌నీ. నేడు, అంతర్జాతీయ వేదికలపై మన దేశానికి ప్ర‌త్యేక గుర్తింపు ఉంద‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు. భార‌త దేశాన్ని చూసి.. ప్రపంచ దేశాలు అనేక పాఠాల‌ను నేర్చుకుంటున్నాయ‌ని అన్నారు. భారతదేశ పురోగతిలో యువకులు నాయకత్వం వహిస్తుండ‌టం చాలా సంతోషంగా ఉంద‌ని అన్నారు. కోవిడ్-19కి వ్యతిరేకంగా పోరాటంలో భారతదేశ శాస్త్రవేత్తలు, వైద్యుల కృషి ఆమోఘ‌మ‌ని, క‌రోనా స‌మ‌యంలో ప్రపంచానికి భార‌త్ ఆశాజ్యోతిగా నిలిచింద‌ని ప్రధానమంత్రి అన్నారు.

అనేక ప్రతికూల పరిస్థితుల్లో భారత్ తన శక్తిపై ఆధారపడి ఉందనీ, మ‌న దేశ శాస్త్రవేత్తలు, వైద్యులు, యువతపై నమ్మకం ఉంచామనీ, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల‌కు భార‌త్ మందులు, టీకాలు అందించింద‌నీ. ఇంత పెద్ద దేశంలోనూ ప్రతి పౌరుడికి వ్యాక్సినేషన్ చేశామ‌నీ, ఆందోళనకు లోను కాకుండా ప్రపంచానికి భార‌త్ మార్గదర్శిగా నిలిచింద‌ని పేర్కొన్నారు.

PM CARES for children Scheme అనాథ పిల్లల ఆర్థిక భరోసా .. 

కరోనా కార‌ణం ఆనాథ‌లైన పిల్ల‌ల‌కు ఆర్థిక చేయూత నివ్వాల‌నే ఉద్దేశ్యం పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ (PM CARES for children Scheme) పథకాన్నిరూపోందించింది. 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలకు ప్రతి నెలా నిర్ణీత స్టైఫండ్, 23 ఏళ్లు నిండితే వారికి రూ.10 లక్షలు అందించ‌నున్న‌ది. అలాగే.. వారికి ఆయుష్మాన్ హెల్త్ కార్డుల (Ayushman Bharat Health Cards)తో రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సాయం అందుతుంది. 2020 మార్చి 11 నుంచి 2022 ఫిబ్రవరి 28 మధ్య కాలంలో కరోనా వ‌ల‌న తల్లిదండ్రులు లేదా చట్టబద్ధమైన సంరక్షకులు లేదా దత్తత తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకాన్ని అర్హులు.