Asianet News TeluguAsianet News Telugu

ఒంటరిగా అబ్బాయి కనిపిస్తే హిజ్రాగా మార్చేస్తారు.. తర్వాత..

ఒంటరిగా బాలురు కనిపిస్తే..వారిని హిజ్రాగా మార్చి భిక్షాటన చేయించే ముఠాలు దేశ ఐటీ రాజధాని బెంగళూరులో కలకలం సృష్టిస్తున్నాయి. మైసూరు జిల్లా కృష్ణరాజపేట తాలుకా హక్కిమంచనహళ్లికి చెందిన చందన్‌కుమార్ బెంగళూరులోని పిన్ని ఇంట్లో ఉంటూ బీబీఎంపీ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాడు. 

transgenders kidnapped tenth student in karnataka
Author
Bengaluru, First Published Oct 31, 2018, 12:53 PM IST

ఒంటరిగా బాలురు కనిపిస్తే..వారిని హిజ్రాగా మార్చి భిక్షాటన చేయించే ముఠాలు దేశ ఐటీ రాజధాని బెంగళూరులో కలకలం సృష్టిస్తున్నాయి. మైసూరు జిల్లా కృష్ణరాజపేట తాలుకా హక్కిమంచనహళ్లికి చెందిన చందన్‌కుమార్ బెంగళూరులోని పిన్ని ఇంట్లో ఉంటూ బీబీఎంపీ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాడు.

స్కూలుకు వేసవి సెలవులు ఇవ్వడంతో ఈ ఏడాది మే నెలలో సొంతూరికి వెళ్లాడు. సెలవులు పూర్తయిన తర్వాత చందన్‌‌కుమార్‌ను అతని తల్లిదండ్రులు తిరిగి బెంగళూరుకు పంపించారు. అయితే బాలుడు బెంగళూరు వెళ్లలేదు..

తల్లిదండ్రులు బెంగళూరు, మైసూరు తదితర ప్రాంతాల్లో గాలింపు చేపట్టినా ఫలితం లేకపోవడంతో కేఆర్‌పేట పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నాటి నుంచి తల్లిదండ్రులు, పోలీసులు బాలుడి కోసం గాలిస్తూనే ఉన్నారు. అయితే ఆదివారం ఇద్దరు హిజ్రాలతో కలిసి చందన్ వెళ్తుండటాన్ని చూసిన ఓ యాచకుడు బాలుడిని గుర్తుపట్టాడు.

ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అని చందన్‌ను అడుగుతుండగా...ఇతర హిజ్రాలతో కలిసి ఆటోలో పారిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో యాచకుడు ఆటోను వెంబడించి పట్టుకుని కేఆర్ పేట పోలీసులకు అప్పగించాడు.

తమ కుమారుడి ఆచూకీ కోసం తల్లడిల్లిపోతున్న తల్లిదండ్రులకు పోలీసులకు సమాచారం అందించడంతో.. వారు బంధువులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. అయితే స్టేషన్‌లో తమ కొడుకు హిజ్రాగా కనిపించగానే కన్నీరుమున్నీరయ్యారు.

తమ బాబుని హిజ్రాలే అపహరించి ఇలా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. లింగ మార్పిడి చేశారన్న ఆరోపణలపై ఇద్దరు హిజ్రాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. బాలుడిని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు.

ఒంటరిగా కనిపించే బాలురకు మాయమాటలు చెప్పి హిజ్రాలు తమ వెంట తీసుకెళుతున్న ఘటనలు మైసూరు పరిసరాల్లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతున్నాయని.. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios