దేశంలోనే తొలిసారిగా కేరళలో ఇద్దరు ట్రాన్స్ జెండర్లు పెళ్లితో ఒక్కటయ్యారు. ఇలా లింగమార్పిడి చేసుకున్న ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకోవడం దేశంలోనే ఇది మొదటి సారి. వీరిద్దరు తమ వివాహాన్ని ట్రాన్స్ జెండర్ గుర్తింపు కింద రిజిస్టర్ చేయాలని హైకోర్టును అప్రోచ్ అయ్యారు. 

కేరళ : Keralaలో అరుదైన పెళ్లి జరిగింది. ఇద్దరు Transgenders వివాహం చేసుకున్నారు. Gender reassignment చేయించుకున్న ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకోవడం దేశంలోనే ఇది మొదటిసారి. Valentine's Dayనే ఈ పెళ్లి జరగడం విశేషం. ట్రాన్స్ జెండర్ లైన శ్యామ ఎస్ ప్రభ, మను కార్తీక పదేళ్లుగా స్నేహితులు. కార్తీక ఓ ప్రైవేట్ సంస్థ మానవ వనరుల విభాగంలో ఉద్యోగి. కేరళ ప్రభుత్వ సంక్షేమ శాఖ ట్రాన్స్ జెండర్ విభాగం సమన్వయకర్త. ఐదేళ్ల క్రితమే Marriage చేసుకోవాలని వారు నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలో లింగ మార్పిడి చేయించుకున్నారు. ప్రేమికుల రోజున తిరువనంతపురంలో బంధుమిత్రుల సమక్షంలో ఒక్కటయ్యారు. ఈ రకమైన వివాహం చట్టబద్ధం కాదు. దీనిపై వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు. తన పెళ్లి ట్రాన్స్జెండర్ వివాహాల్లో సరికొత్త మైలు రాయి కానుందని ఈ సందర్భంగా ప్రభా, మను తెలిపారు.

ఇదిలా ఉండగా, నిరుడు డిసెంబర్ 20న తెలంగాణలో తొలి ‘gay’ వివాహం జరిగింది. ఎనిమిదేళ్లుగా ప్రేమలో ఉన్న అభయ్ డాంగ్, సుప్రియో చక్రవర్తి.. తన కుటుంబ సభ్యులను ఒప్పించుకుని పెళ్లి చేసుకున్నారు. దేశంలో స్వలింగసంపర్కుల పెళ్లిళ్లకు చట్టబద్ధత లేకున్నా సమాజాన్ని ఎదుర్కోలేక బాధపడుతున్న వారికి ధైర్యాన్నివ్వడానికి ఇలా చేశామని చెప్పారు. ఢిల్లీకి చెందిన అభయ్ డాంగ్ (34) హైదరాబాదులో ఆతిథ్య రంగంలో పని చేస్తున్నాడు. కోల్ కతాకు చెందిన చక్రవర్తి (31) కూడా నగరంలోనే ఈ-కామర్స్ సంస్థ ఉద్యోగి. వీరిద్దరూ ఎనిమిది సంవత్సరాల క్రితం ఓ డేటింగ్ ద్వారా కలిశారు. ఇద్దరి మనసులు కలిశాయి. ప్రేమలో పడ్డారు. కలిసి బ్రతుకుదాం అని నిర్ణయించుకున్నారు.

అయితే తమ ప్రేమ, పెళ్లి, సహజీవనం... పేరేదైనా కానీ సమజం నుంచి తమకు ఆమోదం లభించదన్న భయంలో పడ్డారు. అందుతే తమ ప్రేమను బహిర్గతం చేయలేకపోయారు. అందుకే తాము ఉద్యోగాలు చేస్తున్న Hyderabad లోనే.. నాలుగేళ్లుగా గచ్చిబౌలిలో ఎవ్వరికీ తెలియకుండా గుట్టుగా living together చేస్తున్నారు. కానీ ఇటీవలే వారికి ఇది ఇలా కాదు అనిపించింది. ఓ ఫైన్ మార్నింగ్ ఎందుకు ఇలా. ఎవరికీ చెప్పకుండా బతకాలి? అని ఇద్దరు ప్రశ్నించుకున్నారు. దీంతో వీళ్లిద్దరూ కలిసి గత ఫిబ్రవరి 14(lovers day)న తమ ఈ ప్రేమ వ్యవహారం ఓ ఆంగ్ల పత్రికకు interview ఇచ్చారు. 

అందులో ప్రచురితమైన అనంతర పరిణామాలతో ‘మేమిద్దరం కలిసి బ్రతుకుతాం’ అని పేరెంట్స్ కి తేల్చి చెప్పేశారు. మొదట ఈ విషయం విన్న ఇరువైపుల పెద్దలు షాకయ్యారు. ఆ తర్వాత వీళ్లు వివరంగా చెప్పాక ఓకే అన్నారు. దీంతో వీరి పెళ్లికి అడ్డు లేకుండా పోయింది. పెళ్లి బాజాలు మొగాయి. హైదరాబాద్ శంకర్పల్లి లోని ఓ రిసార్ట్ వీరి పెళ్ళికి వేదికయ్యింది. సంగీత్ వగైరా.. వేడుకలన్నీ భాగమైన ఈ రెండు రోజుల పెళ్లికి సిటీ చెందిన మరో ‘గే’ సోఫియా పురోహిత పాత్ర వహించారు. ఈ వివాహానికి Lesbian, gay, bisexual, ట్రాన్స్జెండర్( lgbt) కమ్యూనిటీకి చెందిన పలువురు హాజరయ్యారు.