ఉత్తరాఖండ్‌లో ఒక బ్రిడ్జి దగ్గర ట్రాన్స్‌ఫార్మర్ పేలి 16 మంది మృతి చెందారు. మృతుల్లో ఒక పోలీసు, ముగ్గురు హోంగార్డులు ఉన్నారు.
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లో ఓ బ్రిడ్జి దగ్గరున్న ట్రాన్స్ ఫార్మర్ పేలింది. బ్రిడ్జికి విద్యుద్దీకరణ జరపడంతో ట్రాన్స్‌ఫార్మర్ పేలింది. ఈ పేలుడులో ఒక పోలీసు, ముగ్గురు హోంగార్డులతో సహా కనీసం 15 మంది మరణించారు.నమామి గంగే ప్రాజెక్టులో భాగమైన ఈ వంతెన ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో అలకనంద నదిపై ఉంది. రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అశోక్ కుమార్ మాట్లాడుతూ, "ఒక పోలీసు సబ్-ఇన్‌స్పెక్టర్, ముగ్గురు హోంగార్డులతో సహా 15 మంది వ్యక్తులు విద్యుదాఘాతానికి గురయ్యారు. సంఘటనకు గల కారణాలను కనుగొనడానికి దర్యాప్తు కొనసాగుతోంది"అన్నారు.
ఉత్తరాఖండ్‌లోని చమోలీలో అలకనంద నది ఒడ్డున ఒక వంతెనకు విద్యుద్దీకరణతో ట్రాన్స్‌ఫార్మర్ పేలడంతో ఒక పోలీసు అధికారితో సహా పదహారు మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నమామి గంగే ప్రాజెక్టులో భాగమైన ఈ వంతెన అలకనంద నదిపై ఉంది.
ఈ ఘటన నిన్న రాత్రి చోటుచేసుకుంది. కరెంట్ షాక్ తో ఓ వాచ్‌మెన్ మృతి చెందినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసు సిబ్బంది స్పాట్ ఇన్‌స్పెక్షన్ కోసం వెళ్ళారు. ఆ సమయంలో ట్రాన్స్ ఫార్మర్ పేలడంతో ఈ దారుణం చోటు చేసుకుంది.
"ఒక పోలీసు సబ్-ఇన్‌స్పెక్టర్, ఐదుగురు హోంగార్డులతో సహా దాదాపు 16 మంది మరణించారు. దర్యాప్తు జరుగుతోంది. రైలింగ్‌లో కరెంట్ ఉందని ప్రాథమికంగా వెల్లడైంది. దర్యాప్తు తరువాత మిగతా వివరాలు తెలుస్తాయి" అని ఉత్తరాఖండ్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చెప్పారు.
ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి న్యాయ విచారణకు ఆదేశించారు. ఈ ప్రమాదంలో పిప్పల్‌కోటి ఔట్‌పోస్టు కూడా ప్రాణాలు కోల్పోయాడు.
"ఇది చాలా దురదృష్టకర సంఘటన. పోలీసులు, ఎస్‌డిఆర్‌ఎఫ్, రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలంలో ఉన్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం" అని ముఖ్యమంత్రి చెప్పారు.
క్షతగాత్రులను హెలికాప్టర్ ద్వారా ఎయిమ్స్ రిషికేశ్‌కు తరలిస్తున్నామని, మెజిస్టీరియల్ విచారణకు ఆదేశాలు జారీ చేశామని ఆయన తెలిపారు. ఈ దుర్ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఇంధన కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యానికి పాల్పడ్డారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
