బీహార్ లో ఓ రైలు రెండుగా విడిపోయింది. ఇంజన్ నుంచి 10 భోగీలు విడిపోయాయి. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.
బీహార్ : బీహార్ లోని కతిహార్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. లోహిత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఒకేసారి రెండు భాగాలుగా విడిపోయింది. దాదాపు 10 బోగీలు ఇంజన్ నుంచి విడిపోయి పట్టాలపై నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బెంగాల్‌లోని ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలోని దల్‌ఖోలా స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
అసలు ఏం జరిగింది?
మంగళవారం లోహిత్ ఎక్స్‌ప్రెస్ రైలు.. గౌహతి నుంచి జమ్మూ థపైకి బయలుదేరింది. దల్‌ఖోలా స్టేషన్‌లో రైలు ప్రమాదానికి గురైంది. ఇంజన్ నుంచి దాదాపు పది బోగీలు విడిపోయాయి. ఏం జరిగిందో తెలియక ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రైలు నుండి కోచ్‌లు విడిపోయిన తర్వాత, చాలా మంది ప్రయాణికులు రైలు నుండి బైటికి దూకారు.
అసోంను ముంచెత్తిన వరదలు.. నిరాశ్రయులైన 1.20 లక్షల మంది ప్రజలు
సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, దల్‌ఖోలా స్టేషన్ మాస్టర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ మార్గంలో రైళ్లు నిలిచిపోయాయి. ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించారు. ఆ తర్వాత విడిపోయిన బోగీలను మళ్లీ ఇంజన్‌కు అమర్చి రైలును అధికారులు ప్రారంభించారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
ఇదిలా ఉండగా, ఈ నెల మొదట్లో ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం వందలాదిమందిని బలి తీసుకుంది. ఒడిశాలో జూన్ 2 సాయంత్రం జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 233 కు చేరుకుంది. దాదాపు 900 మందికి పైగా క్షతగాత్రులు అయినట్టు అధికారిక సమాచారం. వీరిలో చాలామంది పరిస్థితి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మూడు రైళ్లు ఒకదానికొకటి గుద్దుకోవడంతో జరిగిన ఈ ఘోర రైలు ప్రమాదంలో.. కోరమండల్ ఎక్స్ప్రెస్ కు చెందిన 15 భోగీలు పట్టాలు తప్పాయి.
ఆ బోగీలు దూసుకెళ్లి మరో పట్టాల మీద వస్తున్న గూడ్స్ రైలు ఢీకొన్నాయి. ఇలా ఒక దానికి మరొకటి మూడు రైళ్లు గుద్దుకోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది.రైలు ప్రమాదంలో మృతి చెందిన వారికి రైల్వే శాఖ రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిమీద విచారణ చేపట్టనుంది. శుక్రవారం రాత్రి 7 గం.ల సమయంలో ప్రమాదం జరగగా.. ఇంకా భోగీల్లో నుంచి ప్రయాణికులను బైటికి తీస్తూనే ఉన్నారు. ఇంకా భోగీల్లో చాలామంది ఉండిపోయారు.
PM Modi in US: ఈ దశాబ్దాన్ని 'టెక్ దశాబ్దం'గా మార్చడమే భారత్ లక్ష్యం.. : ప్రధాని మోడీ
ఈ ఘటన జరిగిన తరువాత ఒడిశాలో వరుస రైలు ప్రమాదాలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. జూన్ 9, శుక్రవారం ఉదయం ఆగిఉన్న రైలులో మంటలు చెలరేగాయి. ఏసీ కోచ్ కింది భాగంలో మంటలు అంటుకున్నాయి. ప్రయాణికులు ఈ విషయాన్ని సకాలంలో గుర్తించడంతో ప్రమాదం తప్పింది.దుర్గ్ - పూరీ ఎక్స్ ప్రెస్ ఏసీ కోచ్ కింద మంటలు చెలరేగాయి. ఒడిశాలోని ఖరియార్ రైల్వేస్టేషన్ లో ఘటన. ప్రయాణికులు గుర్తించి.. అధికారులను అప్రమత్తం చేయడంతో వెంటనే మంటల్ని ఆర్పేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
