ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ రైల్వేస్టేషన్‌లో ఆగివున్న ప్యాసింజర్ రైలు బోగీలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. సాంకేతిక లోపం వల్ల ఇలా జరిగిందా లేదంటే ఎవరైనా నిప్పు పెట్టారా అన్న కోణంలో విచారణలో తేలుస్తామన్నారు డీఆర్ఎం.

మరోవైపు బిహార్‌లో ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది.. ధన్‌పూర్ స్టేషన్ సమీపంలో జనసాధారణ్ ఎక్స్‌ప్రెస్ నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఆదివారం సాయంత్రం 3.50 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అధికారులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.