రైలులో దిగాల్సిన ప్రయాణికులు కూడా షాకైపోయారు. అయ్యో రైలు స్టేషన్ లో ఆగలేదే.. ముందుకు వెళ్లిపోయింది. అని కంగారుపడ్డారు.
ఏ రైలు అయినా ముందుకే నడుస్తుంది. రైలు మాత్రమే కాదు.. ఏ వాహనం అయినా ముందుకే వెళ్తుంది. వెనక్కి వెళ్లడానికి ఉపయోగించం. కానీ ఓ రైలు మాత్రం వెనక్కే నడిచింది. దాదాపు ఓ కిలో మీటరు పాటు అది వెనక్కి వెళ్లడం గమనార్హం. ఏదో టెక్నికల్ ప్రాబ్లం వల్ల అలా జరిగి ఉంటుంది లే అనుకుంటే మీరు పొరబడినట్లే. ఎందుకంటే కావాలని తెలిసే డ్రైవర్ దానిని అలా వెనక్కి నడపడం విశేషం. ఈ సంఘటన కేరళలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
షోరనూర్ నుంచి వేనాడ్ వెళ్లే ఎక్స్ ప్రెస్ రైలు మావెలిక్కర, చెంగన్నూర్ మధ్య ఉన్న చెరియానాడ్ రైల్వే స్టేషన్ లో ఆగాల్సి ఉంది. కానీ డ్రైవర్ మర్చిపోయి అక్కడ ఆపకుండానే ముందుకు వెళ్లిపోయాడు. రైలులో దిగాల్సిన ప్రయాణికులు కూడా షాకైపోయారు. అయ్యో రైలు స్టేషన్ లో ఆగలేదే.. ముందుకు వెళ్లిపోయింది. అని కంగారుపడ్డారు. వారు మాత్రమే కాదు, స్టేషన్ లో ట్రైన్ ఎక్కడానికి ఉన్న ప్రయాణికులు సైతం రైలు ఆగకుండా వెళ్లిపోవడంతో షాకయ్యారు.
దాదాపు కిలోమీటర్ దూరం వెళ్లిపోయిన తర్వాత జరిగిన తప్పును కోకో పైలెట్ గుర్తించాడు. అంతే, మళ్లీ రైలును వెనక్కి తీసుకువచ్చారు. వెనక్కి తీసుకువచ్చి కొత్త ప్రయాణికులను ఎక్కించుకొని, దింపాల్సిన ప్రయాణికులను దింపి మళ్లీ అది గమ్య స్థానానికి చేరింది.
అయితే, ఈ విషయంలో ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది పడినట్లు ఫీలవ్వలేదట. అందుకే రైల్వే అధికారులకు సైతం ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ఆ స్టేషన్ లో సిగ్నల్ కానీ, స్టేషన్ మాష్టర్ కూడా లేకపోవడంతో డ్రైవర్ ఆగకుండా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
