యూపీలో మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర ప్రదేశ్ లోని దమోరా, దుగ్గన్ స్టేషన్ ల మధ్య బుధవారం రాత్రి రైలు పట్టాలు తప్పింది. రైలు ఆరు బోగీలు బోల్తా పడిపోయాయి.

అయితే.. అదృష్టవశాత్తు.. ఆ రైలులో ప్రయాణికులు లేరు. దీంతో ఘోర ప్రమాదం తప్పింది. బోగీలు బోల్తా పడటంతో ఆ రూట్లో ఉన్న డౌన్ లైన్ బ్లాక్ అయ్యింది. మొరాదాబాద్, బ‌రేలీ జంక్ష‌న్ల మ‌ధ్య న‌డిచే రైళ్ల‌ను రూటు మార్చారు. ఇప్పుడా రైళ్లు మొరాదాబాద్‌-చాందౌసి-బ‌రేలీ మ‌ధ్య న‌డుస్తాయి. రైలు ప‌ట్టాలు త‌ప్ప‌డం వ‌ల్ల ఆ రూట్లో వెళ్లే సుమారు 17 రైళ్ల‌కు అంత‌రాయం ఏర్ప‌డింది.