Asianet News TeluguAsianet News Telugu

సెన‌గ‌ల్ లో విషాదం.. ప‌డ‌వ బోల్తా ప‌డిన ఘ‌ట‌న‌లో 13 మంది మృతి.. ప‌లువురు గ‌ల్లంతు

వలసదారులతో ఆఫ్రికా నుంచి ఐరోపా వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ సమయంలో ఆ పడవలో 150 మంది వరకు ఉన్నారు. ఈ ఘటనలో 13 మంది చనిపోయారు. తప్పిపోయిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 

Tragedy in Senegal .. 13 killed in boat capsize .. Several killed
Author
New Delhi, First Published Jun 30, 2022, 9:33 AM IST

ఆఫ్రికాలోని సెనెగల్ సముద్ర తీరంలో పడవ బోల్తా పడింది. ఈ ఘ‌ట‌న‌లో 13 మంది చ‌నిపోయారు. మ‌రి కొంత మంది గ‌ల్లంత‌య్యారు. వలసదారులతో యూరప్‌కు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. వలస‌దారుల మృతిని రెడ్ క్రాస్ అధికారులు ధృవీక‌రించారు. ఈ దుర‌దృష్ట‌క‌ర ఘ‌ట‌న సోమవారం రాత్రి దక్షిణ కాసామాన్స్ ప్రాంతంలోని కఫౌంటైన్ సమీపంలో జరిగిందని పేర్కొన్నారు. 

Kanhaiya Lal Murder : 24 గంటల్లోనే కోటి రూపాయల విరాళాలు.. బీజేపీ నేత కపిల్ మిశ్రా ట్వీట్ కు భారీ స్పందన...

ఈ ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో ఆ ప‌డ‌వ‌లో సుమారు 150 మంది ఉన్నారు. ఇందులో దాదాపు 91 మందిని రెస్క్యూ సిబ్బంది ర‌క్షించారు. మ‌రో 40 మందికిపైగా క‌నిపించ‌కుండా పోయారు. మిగితా వారి కోసం రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై ఆ దేశ అధ్య‌క్షుడు సాల్ సంతాపం తెలిపారు. కాగా ప‌డ‌వలో ఒక్క సారిగా మంట‌లు చెల‌రేగ‌డంతో అది బోల్తా ప‌డిన‌ట్టుగా తెలుస్తోంది. ఈ విష‌యాన్ని స్థానిక మీడియా సంస్జ‌లు వెల్ల‌డించాయి. 

అప్పు తిరిగివ్వలేదని, అక్కాచెల్లెళ్లను వివస్త్రలను చేసి దాడి.. వీడియో వైరల్ కావడంతో..

అయితే అస‌లు మంట‌లు చెల‌రేగ‌డానికి కార‌ణం ఏంట‌నే విష‌యంలో అధికారులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. చాలా కాలంగా ఇక్క‌డి నుంచి వ‌ల‌స‌లు కొన‌సాగుతున్నాయి. చాలా ప్ర‌మాద‌క‌రైన ప‌రిస్థితుల్లో చిన్న చిన్న ప‌డ‌వ‌ల‌ను తీసుకొని ఐరోపాకు వెళ్తుంటారు. ఇలా ప్ర‌తీ సంవ‌త్స‌రం జ‌రుగుతుంటుంది. ఈ క్ర‌మంలో ప్ర‌మాదాలు చోటు చేసుకుంటున్నాయి. గ‌తేడాది ఆగ‌స్టులో కూడా పెద్ద ప్ర‌మాద‌మే జ‌రిగింది. సెయింట్ లూయిస్ వ‌ద్ద ప‌డ‌వ బోల్తా ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో 60 మంది వ‌ర‌కు చ‌నిపోయార‌ని అధికారులు తెలియ‌జేశారు. మ‌రెంతో మంది గ‌ల్లంత‌య్యారు. 

Follow Us:
Download App:
  • android
  • ios