అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా చేపట్టిన ఊరేగింపు విషాదాంతం అయ్యింది. గురువారం అర్థరాత్రి ఊరేగింపులో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులు విద్యుత్ షాక్ తో మృతి చెందారు. మరో ఐదుగులు గాయపడ్డారు. 

మహారాష్ట్ర : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని విరార్ పట్టణంలో జరిగిన వేడుకల సందర్భంగా వాహనంపై అమర్చిన ఇనుప జెండా స్తంభం విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కు తగలడంతో విద్యుదాఘాతంతో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరో ఐదుగురు గాయపడినట్లు పోలీసులు శుక్రవారం రోజున తెలిపారు. భారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పి 132వ జయంతి సందర్భంగా చేపట్టిన ఊరేగింపు ముగిసిన తర్వాత గురువారం అర్థరాత్రి ఈ సంఘటన జరిగిందని వారు తెలిపారు.

గాయపడిన ఐదుగురిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని, వారిని ముంబైలోని ఆసుపత్రికి తరలించామని మీరా భయందర్-వసాయి విరార్ పోలీసు కమిషనరేట్ సీనియర్ అధికారి తెలిపారు. "డాక్టర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని విరార్‌లోని కార్గిల్ నగర్ ప్రాంతంలో ఊరేగింపు జరిగింది. రాత్రి 10.30 గంటల సమయంలో ఊరేగింపు ముగిసింది. 

యూకేలో భారత వ్యతిరేక శక్తులపై కఠిన చర్యలు తీసుకోండి - రిషి సునక్ తో ప్రధాని నరేంద్ర మోడీ

కార్యకర్తలు ఇంటికి వెళ్లడానికి సన్నద్ధం అవుతున్నారు. వాళ్ల వాహనంలో ఒకటి కదలకుండా మొరాయించింది. దీంతో వారిలో కొందరు దానిని నెట్టడం ప్రారంభించారు. అప్పుడు వాహనంపై అమర్చిన ఇనుప జెండా స్తంభం రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కు తాకడంతో కరెంట్ షాట్ వచ్చింది. దీంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి.

ఈ ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యక్ష సాక్షి విలేకరులతో మాట్లాడుతూ, సంఘటన జరిగినప్పుడు కొంతమంది పార్టిసిపెంట్లు, బాంజో ప్లేయర్లు అక్కడ ఉన్నారని చెప్పారు. "ఘటన స్థలంలో గందరగోళం నెలకొంది. కొంత సమయం వరకు సరిగ్గా ఏమి జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు" అని అతను చెప్పాడు.

మృతులను రూపేష్ సర్వే (23), సుమిత్ సూద్ (30)గా గుర్తించామని, వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి ప్రమాదవశాత్తు మరణంగా నమోదు చేసుకున్నామని, పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు అధికారి తెలిపారు.