ఎలక్ట్రిక్ షాప్ లో అగ్నిప్రమాదం జరగడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోయారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణెలో చోటు చేసుకుంది. బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఈ అగ్నిప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు.

మహారాష్ట్రలోని పూణెలో ఘోరం జరిగింది. ఓ ఎలక్ట్రిక్ షాప్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం అయ్యారు. బుధవారం తెల్లవారుజామున పూణెలోని పింప్రి చించ్వాడ్ లోని చిఖలీ ప్రాంతంలో ఉన్న ఓ దుకాణంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. దుకాణం ఉన్న నివాస భవనం గ్రౌండ్ ఫ్లోర్ లో5 గంటల సమయంలో మంటలు చెలరేగాయి.

ఈ ఘటనపై అగ్నిమాక విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘పుణె జిల్లా పింప్రి-చించ్వాడ్ లోని పూర్ణానగర్ ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఈ రోజు ఉదయం 5 గంటల సమయంలో నివాస భవనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఎలక్ట్రిక్ హార్డ్ వేర్ దుకాణంలో మంటలు చెలరేగాయి’’ అని పీసీఎంసీ (పింప్రి-చించ్వాడ్ మునిసిపల్ కార్పొరేషన్) ప్రకటనలో పేర్కొంది.

Scroll to load tweet…

కాగా.. ఈ ప్రమాదంలో చనిపోయిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం స్థానికంగా విషాదాన్ని నింపింది. మృతులను చిమ్నారామన్ చౌదరి, జ్ఞానదేవి చౌదరి, సచిన్ చౌదరి, భవేష్ చౌదరిగా అధికారులు గుర్తించారు. కాగా.. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై సమాచారం అందగానే అగ్నిమాపక దళం బృందాలు అక్కడి చేరుకున్నాయి. మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.