ఓ పులి విషయంలోనూ ఇదే జరిగింది. ఓ పులి రోడ్డు దాటడానికి ఓ ట్రాఫిక్ పోలీసు ప్రయాణికులందరినీ ఆపేశాడు. ఈ సంఘటన మన దేశంలోనే చోటుచేసుకోగా.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సెలబ్రెటీలు.. ముఖ్యంగా సీఎం, పీఎం లాంటి వాళ్లు ఒక రోడ్డు వైపు వెళ్లాలి అంటే ట్రాఫిక్ పోలీసులు ముందుగానే ఆ రోడ్డు మొత్తం క్లియర్ చేస్తూ ఉంటారు. అటూగా వెళ్లాల్సిన ప్రయాణికులందరినీ ఆపేసి మరీ... సీఎం, పీఎం కాన్వాయికి దారి ఇస్తారు. ఓ పులి విషయంలోనూ ఇదే జరిగింది. ఓ పులి రోడ్డు దాటడానికి ఓ ట్రాఫిక్ పోలీసు ప్రయాణికులందరినీ ఆపేశాడు. ఈ సంఘటన మన దేశంలోనే చోటుచేసుకోగా.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో, ట్రాఫిక్ పోలీసు సిబ్బంది రోడ్డుకు ఇరువైపులా సిగ్నల్ వద్ద ప్రయాణికులను ఆపడం చూడవచ్చు. వాస్తవానికి, వారు హైవేను దాటడానికి ప్రయత్నిస్తున్న పులిని చూశారు. పోలీసులు సకాలంలో జోక్యం చేసుకోవడంతో పులి ఎలాంటి ఆటంకాలు లేకుండా రోడ్డు దాటగలిగింది. క్లిప్‌లోని అత్యంత అద్భుతమైన విషయం ఏమిటంటే, పులి చాలా ప్రశాంతంగా ఉంది. పులి రోడ్డు క్రాస్ చేసే వరకు ప్రయాణికులంతా ఓపికగా వేచి ఉండటం గమనార్హం.
ఈ వీడియోని ఐఎఫ్ సీ అధికారి ప్రవీన్ కుశ్వాన్ షేర్ చేయడం గమనార్హం. ఈ వీడియోకి ఇప్పటి వరకు 86వేల మంది వీక్షించడం గమనార్హం. పులికి మాత్రమే గ్రీన్ సిగ్నల్... అంటూ కొందరు కామెంట్లు చేయడం గమనార్హం. అయితే... ఇది ఎక్కడ జరిగింది అనేది మాత్రం క్లారిటీ లేదు.
