ప్రపంచంలోని పర్యాటకులు ఎక్కువగా సందర్శించే  ప్రాంతాల్లో బీహార్‌లోని బోద్‌గయా ఒకటి.  కాగా.. ఆ బోదగయాలో ఓ టూరిస్ట్ ఆత్మహత్య చేసుకున్నాడు. అటవీ ప్రాంతంలోని చెట్టుకు ఉరివేసుకుని తనువు చాలించాడు. ఆ ప్రాంతం గుండా వెళ్తున్న స్థానికులు ఈ ఉదయం టూరిస్ట్ ఆత్మహత్యను గమనించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటన స్థలంలో ఓ బ్యాగు, వాటర్ బాటిల్‌ను గుర్తించారు. డైరీలోని ఫోన్ నెంబర్ల ప్రకారం మృతుడిని ఆస్ట్రేలియన్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.