త్రిస్సూర్: రోడ్డు పక్కన ఉన్న స్థలంలో ఓ ప్రైవేట్ బస్సు డ్రైవర్ వరి పండించాడు. అంతేకాదు ఇతర పంటలను కూడ ఆయన పండించాడు. తాను పండించిన పంటలు ఊరి వారికి ఉచితంగా ఇస్తున్నాడు.

కేరళ రాష్ట్రంలోని త్రిసూర్ కు సమీపంలోని పెరిన్‌జనమ్ అనే గ్రామానికి చెందిన అనిల్ కుమార్ అనే వ్యక్తికి పచ్చదనం  అంటే విపరీతమైన అభిమానం.

ప్రైవేట్ టూరిస్ట్ బస్సుకు ఆయన డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఆయనకు అంగుళం స్థలం కూడ లేదు. దీంతో ఆయన రోడ్డుకు పక్కన ఉన్న ఖాళీ స్థలంలో పంటలు పండించాడు. 

ఈ రోడ్డు పక్కన ఉన్న స్థలంలో కూరగాయలు, వరి పండించాడు. రోడ్డు పక్కన కూరగాయలు పెంచడాన్ని గ్రామ పంచాయితీ గమనించింది. అయితే రోడ్డుకు ఇబ్బంది కల్గించనని అనిల్ కుమార్ గ్రామ పంచాయితీకి హామీ ఇచ్చాడు.

డ్యూటీ లేని సమయంలో ఆయన రోడ్డుకు ఇరువైపులా కూరగాయలను పెంచాడు. ఈ తోటల్లో కూరగాయలు మొలకెత్తాయి.అయితే వీటిని కొనుగోలు చేయవచ్చా అని గ్రామస్తులు అడిగితే వారికి ఉచితంగా ఇచ్చాడు.

లాక్ డౌన్ సమయంలో ఆయనకు ఉద్యోగం పోయింది. రోడ్డు పక్కన స్థలంలో కూరగాయలతో పాటు వరిని కూడ పండించి ఆయన సక్సెస్ అయ్యాడు.ఈ స్థలంలో పండించిన కూరగాయలను అప్పుడప్పుడు ఇంటికి తీసుకెళ్లేవాడు.