తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మధురై సమీపంలో టూరిస్టు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా.. 15 మంది గాయపడ్డారు. వీరంతా ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లికి చెందిన వారు. అయ్యప్ప మాలలు ధరించిన వారు మాల విరమణ కోసం బస్సులో శబరిమల బయలుదేరారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక కార్యక్రమాలు చేపట్టారు. మరిన్ని వివరాలు అందాల్సి వుంది.