అనూహ్య పరిణామాల తర్వాత.... మహారాష్ట్ర లో శివసేన, కాంగ్రెస్ కూటమి అధికారం చేజిక్కించుకుంది. అయితే... పదవులుచేపట్టిన కొంత కాలానికే కాంగ్రెస్ నేతలపై ఆరోపణలు మొదలయ్యాయి. అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని  పలువురు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ కాంగ్రెస్ నేత , మహిళా మంత్రి యశోమటి ఠాకూర్ ఆదివారం సంచలన కామెంట్స్ చేశారు.

ఆవును తాకితే... నెగిటివిటీ నుంచి దూరంగా ఉండొచ్చంటూ ఆమె పేర్కొన్నారు. కాగా.. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. ఆదివారం మంత్రి యశోమటి ఠాకూర్... శ్రాషి అనే గ్రామంలో పర్యటించారు. ఆ గ్రామంలో దేవతగా కొలిచే ఓ ఆవు చనిపోవడంతో... దానికి వర్థంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.. ఆవును తాగితే.. నెగిటివిటీ పోతుందనిపేర్కొన్నారు.

Also Read సంక్రాంతి బంపర్ ఆఫర్... మెట్రో రైళ్ల టికెట్ ఛార్జ్ తగ్గింపు...

అంతేకాకుండా తాను మతాన్ని మాత్రమే నమ్ముతానని చెప్పారు. మనం దేన్నైతే నమ్ముతామో అదే మన మతం అవుతుందని చెప్పారు. దేవుడికి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే.. కోరుకున్నవన్నీ నిజమౌతాయని చెప్పారు. అనంతరం యువత గురించి మాట్లాడారు. యువత స్వతంత్ర్యంగా జీవించాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. కానీ.. వారంతా స్వామివారి పాదాలను తాకి.. ఆయన పేరును జపించినప్పడే.. విజయం సాధించగలరని చెప్పారు.

కాగా.. ఆమె చేసిన పలు వ్యాఖ్యలపై స్థానికులు కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా... తాను మాట్లాడిన వాటిల్లో అసత్యం ఏమీలేదంటూ ఆమె వాటిని సమర్థించుకునే ప్రయత్నం చేయడం గమనార్హం.  ప్రస్తుతం హిందూ దేవుళ్లను పొగుడ్తూ.. ఇతర దేవుళ్లను కించపరిచారంటూ మహిళా మంత్రిపై విమర్శలు వ్యక్తమౌతున్నాయి.