నవంబర్ 9 అర్థరాత్రి నుంచి నవంబర్ 30 వరకు ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో పటాకుల అమ్మకాన్ని, వాడకాన్ని నిషేధిస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబునల్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిషేధం నాలుగు రాష్ట్రాల్లోని 24జిల్లాల్లో ఉండనుంది. 

గత నవంబర్ లో స్వచ్ఛమైన గాలి నాణ్యత మరీ అధ్వాన్నంగా ఉన్న నగరాలు, పట్టణాలకు ఈ నిషేధం అమలులో ఉంటుందని ట్రిబ్యునల్ తెలిపింది. 

కోవిద్ 19 కారణంగా గాలి కాలుష్యం కాకుండా చూసుకోవాలని, అందుకే గాలి నాణ్యత తక్కువగా ఉన్న నగరాలు, పట్టణాల్లో అతి తక్కువ కాలుష్యాన్ని కలిగించే గ్రీన్ క్రాకర్లు  మాత్రమే వాడాలని తెలిపింది. 

అంతేకాదు ఈ రాష్ట్రాల్లో పటాకులు కాల్చే సమయాన్ని రెండు గంటలకు పరిమితం చేసింది. దీపావళి, గురుపూర్బ్ ల రోజు రాత్రి 8 నుంచి 10 గంటలవరకు, ఛట్ పండుగ రోజు ఉదయం 6-8 గం.ల వరకు, రాత్రి 11.55 నుంచి 12.30 గంటల వరకు ఉంటుందని తెలిపింది. ఇదే క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలకూ వర్తిస్తుందని ఆర్డర్ పాస్ చేశారు. 

నిషేధం విధించిన ఈ రాష్ట్రాలే కాకుండా మిగతా రాష్ట్రాలు కూడా పటాకుల వాడకం మీద బ్యాన్ ను ఆప్షనల్ గా పెట్టవచ్చని ఎన్ జీటి సూచించింది. స్వచ్ఛమైన గాలికోసం ఇలా చేయవచ్చని సలమా ఇచ్చింది. కోవిద్ 19కి కారణమయ్యే గాలి కాలుష్యాన్ని తగ్గించడానికి స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించాలని ఆదేశించింది. 

కరోనా మహమ్మారి సమయంలో ఫైర్ క్రాకర్స్ వల్ల గాలి నాణ్యతలో వచ్చే తేడా చాలా ప్రమాదకరంగా పరిణమించబోతుందని వాయు కాలుష్యంపై చర్యలు తీసుకోవాలని ఓ వ్యక్తి వేసిన పిటిషన్‌పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ మేరకు చర్యలు ఆదేశించింది.