Asianet News TeluguAsianet News Telugu

కాశ్మీర్ లోయలో సరికొత్త ఉపాధి మార్గాలు.. టాప్ 20 బిజినెస్‌ ఐడియాలు..

ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు.. స్థానిక మార్కెట్ డిమాండ్, పోటీని పరిగణనలోకి తీసుకోవడం చాలా అవసరం. మీ ఆలోచన ఆచరణీయమైనదేనా.. స్థానిక మార్కెట్‌లో మీ వ్యాపారం నిలకడ ఉండగలదని నిర్ధారించుకున్న తరువాతనే వ్యాపారం ప్రారంభించండి. 

top 10  Business ideas for Kashmir Valley  KRJ
Author
First Published Apr 25, 2023, 4:56 PM IST

నేటీ యువత చాలా సృజనాత్మకతంగా ఆలోచిస్తోంది. ఉద్యోగం కోసం పరుగులు తీయకుండా.. ఉన్నదానిలో  గౌరవంగా బతుకుదామనే ధోరణి వారిలో ఎక్కువైంది. జీతం కోసం ఉన్న తన విలువైన సమయాన్ని వ్రుధా చేసే బదులు.. స్వంతంగా వ్యాపారం ప్రారంభించాలని,  అడుగులు వేస్తుంది.  అలా తక్కువ సమయంలో ఎక్కువ సంపాధించవచ్చనీ, తమతో పాటు  ఇంకొంతమందికి ఉపాధి కల్పించాలని, ఉద్యోగాలకు స్వస్తి పలుకుతున్నారు. తక్కువ పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించి…ఎక్కువ లాభాలు పొందుతున్నారు. జమ్మూ కాశ్మీర్‌లోని యువత కూడా ఇదే మార్గంలో ప్రయాణిస్తోంది.

కాశ్మీర్ లోయలోని టాప్ 20 వ్యాపార ఆలోచనలు :

వర్టికల్ ఫార్మింగ్: సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధితో పట్టణ ప్రాంతాల్లోనూ వ్యవసాయం ప్రజాదరణ పొందుతోంది. స్థానిక రెస్టారెంట్లు, మార్కెట్‌ల కోసం తాజా, సేంద్రీయ, పురుగుమందులు లేని ఉత్పత్తులను పెంచడానికి వర్టికల్ ఫార్మింగ్ చేయవచ్చు.  

హైడ్రోపోనిక్ వ్యవసాయం: నీటిలో ఖనిజ పోషక ద్రావణాలను ఉపయోగించి మట్టి లేకుండా మొక్కలను పెంచడానికి హైడ్రోపోనిక్ వ్యవసాయం అంటాం. ఈ పద్దతిలో సాంప్రదాయ వ్యవసాయ పద్ధతుల కంటే తక్కువ నీరు,తక్కువ స్థలాన్ని ఉపయోగించుకుంటూ వ్యవసాయం చేయవచ్చు. ఈ పద్దతి ద్వారా తాజా,పురుగుమందులు లేని ఉత్పత్తి చేయవచ్చు. ఈ ఉత్పత్తులకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.   
 
ఇ-రిక్షా (సౌరశక్తి): సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ రిక్షాలను పర్యావరణ అనుకూలం. ఈ రవాణా వ్యవస్థ చాలా ఉత్తమం. ఇ-రిక్షా ద్వారా పర్యాటకులకు, స్థానికులకు రవాణా సేవలను అందించవచ్చు. 

కాశ్మీరీ క్రాఫ్ట్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్: కాశ్మీర్ లోయ హస్తకళలకు ప్రసిద్ది. వీటికి ప్రపంచ వ్యాప్తంగా మంచి కిరాయి ఉంటుంది. ఈ ప్రత్యేకమైన హస్తకళలను  ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్స్ ద్వారా విక్రయించడం కూడా మరో ఉత్తమ ఉపాధి మార్గం. వీటిని స్థానిక కళాకారుల నుంచి సేకరించి ఆన్ లైన్ పోర్టల్ లో పెట్టి ఆదాయాన్ని పొందవచ్చు. 

వేస్ట్ మేనేజ్‌మెంట్,రీసైక్లింగ్: ప్రతి నగరంలోని ప్రధాన సమస్యలో ఒకటి వ్యర్థాల సేకరణ. ఈ వ్యవస్థ ఒక్కసారి ఆగిపోయిన మన జీవనం అస్తవ్యస్థంగా మారుతోంది. ఈ సమస్య పరిష్కార మార్గమే నూతన  ఉపాధి మార్గం.  శ్రీనగర్‌లోని గృహాలు, వ్యాపార సంస్థలను వ్యర్థాల సేకరణ, రీసైక్లింగ్ సేవలను అందించే వేస్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్ ను ప్రారంభించండి. ఇది నగర పరిశుభ్రతను మెరుగుపరచడానికి, ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది.

ఇండోర్ ఎంటర్‌టైన్‌మెంట్ సెంటర్: గేమింగ్ జోన్‌లు, వర్చువల్ రియాలిటీ అనుభవాలు , ఎస్కేప్ రూమ్‌లు వంటి విభిన్న కార్యకలాపాలతో ఇండోర్ ఎంటర్‌టైన్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయండి. విశ్రాంతి ఎంపికల కోసం వెతుకుతున్న పర్యాటకులను,స్థానికులను ఆకర్షించడానికి అనువుగా ఉంది.  

కేఫ్: పోషకమైన, స్థానికంగా లభించే ,సేంద్రీయ ఆహార ఎంపికలపై దృష్టి సారించే కేఫ్‌ను ప్రారంభించండి. ఆరోగ్య స్పృహ కలిగిన కస్టమర్‌లకు వివిధ రకాల శాఖాహారం, శాకాహార వంటకాలు, తాజా జ్యూస్‌లను అందించండి.

సాంస్కృతిక, విద్యా పర్యాటకం: కాశ్మీర్ కు చాలా గొప్ప చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నాయి. వీటిని ఆధారంగా చేసుకుని ఎడ్యూకేషన్ టూర్స్ , వర్క్‌షాప్‌లను అందించే వ్యాపారాన్ని అభివృద్ధి చేయండి. ఇందులో భాషా తరగతులు, వంట తరగతులు, చారిత్రక ప్రదేశాల సందర్శనలు వంటి ఏర్పాటు చేయండి.  

ప్యాకేజింగ్ : స్థానిక వ్యాపారాల కోసం స్థిరమైన , బయోడిగ్రేడబుల్ ప్యాకేజింగ్ మెటీరియల్‌లను ఉత్పత్తి చేసే వ్యాపారాన్ని అభివృద్ధి చేయండి. ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడం, ఆహ్లాదకర వాతావరణాన్ని ప్రోత్సహించే విధంగా ఏర్పాటు చేయండి.

స్పెషల్ టీ హౌస్: ప్రసిద్ధ కాశ్మీరీ కహ్వాతో సహా పలు రకాల స్థానిక,అంతర్జాతీయ టీ రుచులను అందించే టీ హౌస్‌ను తెరవండి. టీ-టేస్టింగ్ ఈవెంట్‌లు, వర్క్‌షాప్‌లను హోస్ట్ చేయండి. టీ లవర్స్  ఇష్టపడే విధంగా టీ హౌస్ ను రూపొందించండి.  

హెరిటేజ్ హోమ్‌స్టేలు: పాత, సాంప్రదాయ గృహాలను ప్రత్యేకమైన , సౌకర్యవంతమైన హోమ్‌స్టేలుగా మార్చండి. కాశ్మీరీ సంస్కృతిని మేళవించేలా..  పర్యాటకులకు ఆతిథ్యం అందించండి. వారికి కాశ్మీరి సంస్కృతిని పరిచడం చేయండి. 

డ్రోన్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ: ఈవెంట్‌లు, టూరిజం, వ్యాపారాల కోసం డ్రోన్ ఆధారిత ఫోటోగ్రఫీ , వీడియోగ్రఫీ సేవలను ప్రారంభించండి.  

సేంద్రీయ చర్మ సంరక్షణ ఉత్పత్తులు: కుంకుమపువ్వు, బాదం , వాల్‌నట్‌లు వంటి స్థానికంగా లభించే పదార్థాలను ఉపయోగించి సేంద్రీయ, పర్యావరణ అనుకూల చర్మ సంరక్షణ ఉత్పత్తులను తయారు చేయండి. మీరు ఈ ఉత్పత్తులను ఆన్‌లైన్ స్టోర్ ద్వారా, స్థానిక రిటైలర్‌లతో భాగస్వామిగా విక్రయించవచ్చు.

ఆర్టిసానల్ బేకరీ: సాంప్రదాయ కాశ్మీరీ బేక్డ్ గూడ్స్‌తో పాటు అంతర్జాతీయ పేస్ట్రీలు , బ్రెడ్‌లలో ప్రత్యేకత కలిగిన ఆర్టిసానల్ బేకరీని ప్రారంభించండి. ఆరోగ్య స్పృహ కలిగిన వినియోగదారులకు విజ్ఞప్తి చేయడానికి స్థానికంగా లభించే, సేంద్రీయ పదార్థాలను ఉపయోగించండి.

రేంట్ సైకిల్స్: శ్రీనగర్, దాని పరిసరాల్లో గైడెడ్ టూర్‌లను అందించే రేంట్ సైకిల్స్ ను ప్రారంభించండి. పర్యాటకులు ఈ ప్రాంతాన్ని అన్వేషించడానికి ఆరోగ్యకరమైన , పర్యావరణ అనుకూల మార్గమిదేనని  ప్రచారం చేయండి.

డెస్టినేషన్ వెడ్డింగ్ వేదిక: వివాహ వేదికలను సృష్టించండి. శ్రీనగర్‌లో అన్ని సంస్కృతులు, మతాల వారిని  ప్యాకేజీలను అందించడం, లోయలోని పర్యాటక ప్రాంతాన్ని బయట ప్రపంచాన్ని పరిచయం చేయండి. థీమ్ ఆధారిత వివాహాలు కాశ్మీర్ యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వం నుండి అంశాలను పొందవచ్చు. జంటలకు మరపురాని అనుభూతిని అందించడానికి సంప్రదాయ వాస్తుశిల్పం, అలంకరణ, వంటకాలు, వినోదాన్ని అందించండి.   

ఫ్రూట్ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్: యాపిల్స్, చెర్రీస్ మరియు ఆప్రికాట్ వంటి స్థానికంగా పండించే పండ్లను డ్రై ఫ్రూట్స్, ప్రిజర్వ్‌లు, జ్యూస్‌ల వంటి అధిక-నాణ్యత ఉత్పత్తులుగా మార్చడంలో.. ప్రత్యేకత కలిగిన పండ్ల ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయండి. ఇది స్థానిక రైతులకు మద్దతు ఇవ్వడానికి, ఈ ప్రాంతంలోని ఉత్పత్తులను కొత్త మార్కెట్లకు పరిచయం చేయడానికి సహాయపడుతుంది.

ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు.. స్థానిక మార్కెట్ డిమాండ్, పోటీని పరిగణనలోకి తీసుకోవడం చాలా అవసరం. మీ ఆలోచన ఆచరణీయమైనదేనా.. స్థానిక మార్కెట్‌లో మీ వ్యాపారం నిలకడ ఉండగలదని నిర్ధారించుకోవడానికి క్షుణ్ణంగా పరిశోధన చేయండి. స్థానిక నిపుణులతో సంప్రదించండి. మీరు మీ ఆలోచనను చర్చించడానికి EDI , మీ స్థానిక ఉపాధి శాఖను కూడా సంప్రదించవచ్చు.

Follow Us:
Download App:
  • android
  • ios