సారాంశం

గ్రేటర్ నోయిడాలోని టోల్ ప్లాజా వద్ద టోల్ చెల్లించాలని డిమాండ్ చేయడంతో కారులో ప్రయాణిస్తున్న మహిళలు ఆగ్రహం వ్యక్తం చేసింది.టోల్ బూత్ వద్ద ఉన్న మహిళా ఉద్యోగినిపై దాడి చేసింది. అనంతరం ఆ మహిళ బారికేడ్‌ని బద్దలు కొట్టుకుని వెళ్లిపోయింది.  
 

ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. టోల్ ఫేమెంట్ కట్టుమన్నందుకు టోల్ ప్లాజాలోకి దౌర్జన్యంగా  మహిళా ఉద్యోగినిపై ఓ మహిళ దాడికి పాల్పడిన వీడియో బయటపడింది. ఆ మహిళ బారికేడ్‌ని కూడా పగలగొట్టి కారును బయటకు తీయమని తన భాగస్వామిని కోరింది. ఈ ఘటన టోల్ వద్ద అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ సంఘటన సోమవారం జరిగింది.

పోలీసుల అందిన సమాచారం ప్రకారం.. గ్రేటర్ నోయిడాలో ఒక మహిళ , ఒక వ్యక్తి కారులో ప్రయాణిస్తు టోల్‌కు చేరుకున్న వీడియో బయటపడింది. వారు తమని తాము స్థానికులుగా చెప్పుకున్నారు.  ఫ్రీగా పంపించాల్సిందిగా కోరారు. అయితే. టోల్ బూత్ వద్ద ఉన్న మహిళా  ఉద్యోగిని వారిని ఐడి చూపించమని అడిగింది. కానీ, వారు ఎలాంటి చూపించలేదు. పైగా కారులో ఉన్న మహిళ కిందికి దిగి వచ్చి.. టోల్ క్యాబిన్ లోకి చొరబడి  మహిళా ఉద్యోగినిపై దాడికి పాల్పడ్డారు. బారికేడ్‌ని బద్దలు కొట్టి కారును ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు.

ఈ ఘటన అంతా అక్కడ అమర్చిన సీసీటీవీలో రికార్డయింది. మహిళ ఆవేశంతో కారు దిగి క్యాబిన్‌కు చేరుకుని మహిళా టోల్‌ ఉద్యోగిని బెదిరించి కుర్చీలో నుంచి కిందపడేలా చేయడం వీడియోలో కనిపిస్తోంది. ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత వాహనం నంబర్‌ ద్వారా మహిళ, పురుషుడిని గుర్తించిన పోలీసులు ఆ తర్వాత మహిళను అదుపులోకి తీసుకుని విచారించారు. టోల్‌పై పోరాటంలో ఇది మొదటి వీడియో కాదు.  ఇప్పటికే చాలా వీడియోలు వైరల్ అయ్యాయి.