Asianet News TeluguAsianet News Telugu

టోల్‌ప్లాజ్‌లు ఎత్తివేస్తాం.. సంవత్సరం డెడ్‌లైన్: లోక్‌సభలో గడ్కరీ ప్రకటన

జాతీయ రహదారులపై నిరాటంకంగా ప్రయాణం సాగించేందుకు గాను టోల్‌ప్లాజాల వద్ద ఫాస్టాగ్‌ను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీంతో టోల్‌ప్లాజాలను దశల వారీగా ఎత్తేయాలని భావిస్తోంది. దీనిలో భాగంగా వచ్చే ఏడాదిలోగా దేశంలోని అన్ని టోల్‌ప్లాజాలను పూర్తిగా తొలగిస్తామని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు

Toll booths to be removed GPS based toll collection within 1 year says Nitin Gadkari ksp
Author
New Delhi, First Published Mar 18, 2021, 4:38 PM IST

జాతీయ రహదారులపై నిరాటంకంగా ప్రయాణం సాగించేందుకు గాను టోల్‌ప్లాజాల వద్ద ఫాస్టాగ్‌ను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీంతో టోల్‌ప్లాజాలను దశల వారీగా ఎత్తేయాలని భావిస్తోంది.

దీనిలో భాగంగా వచ్చే ఏడాదిలోగా దేశంలోని అన్ని టోల్‌ప్లాజాలను పూర్తిగా తొలగిస్తామని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. దీని స్థానంలో జీపీఎస్‌ ఆధారిత టోల్‌ వసూళ్ల వ్యవస్థను తీసుకొస్తామని ఆయన గురువారం లోక్‌సభకు వివరించారు.

వాహనానికి ఉన్న జీపీఎస్‌ ఆధారంగా వాహనదారుల బ్యాంకు ఖాతా నుంచి నేరుగా టోల్‌ మొత్తాన్ని మినహాయించుకునే కొత్త వ్యవస్థను తీసుకొస్తామని గడ్కరీ పేర్కొన్నారు.  కాగా, దేశవ్యాప్తంగా 93 శాతం మంది వాహనదారులు ఫాస్టాగ్‌ ద్వారానే టోల్‌ చెల్లిస్తున్నారని కేంద్రమంత్రి తెలిపారు.

అయితే మిగతా 7శాతం మంది మాత్రం రెట్టింపు టోల్‌ కడుతున్నా ఫాస్టాగ్‌ ఉపయోగించడం లేదని స్పష్టం చేశారు. ఫాస్టాగ్‌ ద్వారా టోల్‌ చెల్లించని వాహనదారులపై పోలీసుల దర్యాప్తునకు ఆదేశించినట్లు గడ్కరీ లోక్‌సభకు తెలిపారు.

టోల్‌ ప్లాజాల వద్ద వాహనాల రద్దీని నివారించేందుకు గాను 2016లో ఫాస్టాగ్‌లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 16 నుంచి అన్ని జాతీయ రహదారులపై వీటి వినియోగాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. ఇదే సమయంలో ఫాస్టాగ్‌ లేని వారి నుంచి రెట్టింపు టోల్‌ వసూలు చేస్తున్నారు.   

అయితే ఇప్పుడు అన్ని వాహనాల్లో వెహికల్‌ ట్రాకింగ్‌ వ్యవస్థ వస్తున్నందున.. టోల్‌ వసూలుకు కూడా జీపీఎస్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

జీపీఎస్‌ ఆధారంగా... వాహన కదలికలను బట్టి వినియోగదారు బ్యాంకు ఖాతా నుంచి నేరుగా టోల్‌ మొత్తాన్ని మినహాయించుకొనే కొత్త వ్యవస్థను తీసుకొస్తున్నట్లు గడ్కరీ గతంలోనే తెలిపారు. నూతన విధానం అమల్లోకి వస్తే.. వాహనదారులు జాతీయ రహదారిపై ప్రయాణించిన దూరానికే టోల్‌ ఛార్జీలు పడతాయి.  
 

Follow Us:
Download App:
  • android
  • ios