వాళ్లకి ఈ ఏడాది మార్చిలోనే వివాహమైంది. కానీ ఆ పెళ్లైన ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. పెళ్లైన ఆరు నెలలకే భార్య కన్నుమూసింది. భార్య చనిపోవడాన్ని భర్త తట్టుకోలేకపోయాడు. అందులోనూ ఆమె గర్భవతి. దీంతో... భార్య చితిలోనే తాను కూడా దూకి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. కానీ బంధువులు కాపాడటంతో..మళ్లీ బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మహారాష్ట్ర లోని చంద్రపూర్ కి చెందిన కిశోర్ కి.. ఈ ఏడాది మార్చిలో రుచిత అనే యువతితో పెళ్లైంది. కాగా అనుకోకుండా ఆమె ప్రాణాలు కోల్పోయింది.  కాగా.. భార్య రుచిత దూరమవడాన్ని భర్త కిషోర్ తట్టుకోలేక పోయాడు. ఆమె లేని ప్రపంచంలో తను ఉండలేనని నిశ్చయించుకుని భార్య చితిపై దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు.

 అదృష్టవశాత్తూ బంధువులు అతడిని కాపాడాగలిగారు. కానీ అతడి నిర్ణయాన్ని మాత్రం మార్చలేక పోయారు. దీంతో అతడు ఈ సారి బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

కాగా..  అతని భార్య ఆత్మహత్య  చేసుకొని ప్రాణాలు కోల్పోయిందని పోలీసు దర్యాప్తులో తేలింది. నాలుగు రోజుల క్రితం ఆమె తన తల్లికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో పుట్టింటికి వెళ్లిందని వారు అన్నారు. ఆదివారం నాడు ఆమె ఇంటికి తీసుకెళ్లేందుకు భర్త కూడా అత్తమామల దగ్గరకు వెళ్లాడు. అక్కడ ఆమె కనిపించకపోవడంతో బంధువులందరూ కలిసి ఆమె కోసం గాలించారు.

ఈ క్రమంలో బావిలో తేలుతూ ఆమె కినిపించింది. ఆత్మహత్యకు పాల్పడిందని తెలుసుకు భర్తతో పాటూ బంధువులందరూ బోరున విలపించారు. సోమవారం నాడు ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె చితికి నిప్పటించి వెనక్కు వచ్చిన కిషోర్.. అకస్మాత్తుగా భార్య చితిలోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అయితే బంధువుల అతడిని కాపాడారు.

కిషోర్ మళ్లీ వారి నుంచి విడిపించుకుని.. పక్కనే ఉన్న బావిలోకి దూకేశాడు. అతడిని రక్షించేందుకు బంధువులు బావిలోకి తాడు విసిరనప్పటికీ అతడు దాన్ని అందుకోలేదు. భార్యతో ఎడబాటు తట్టుకోలేక అతడు నీళ్లలో మునిగి ప్రాణాలు విడిచాడు.