Asianet News TeluguAsianet News Telugu

బుసలు కొడుతున్న పాముతో బుడ్డోడి ఆటలు.. నెట్టింట్లో వీడియో వైరల్..

సాధారణంగా పాము అంటే.. అందరి భయమే.. పాము ఉందంటే ఉరుకులు పరుగులు పెట్టేవారుంటారు.  కానీ..ఓ బుడ్డోడు బుసలు కొడుతున్న పామును ఓ బొమ్మలా భావించి ఓ ఆట ఆడేస్తున్నాడు.  ప్రస్తుతం ఆ బుడ్డోడి వీడియో  వైరల్ గా మారింది. ఈ వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 

Toddler Plays With Snake At Home, VIDEO VIRAL  KRJ
Author
First Published Jul 17, 2023, 7:37 AM IST | Last Updated Jul 17, 2023, 7:37 AM IST

చాలా మంది పాములంటేనే ఉరుకులు పరుగులు పెట్టేవారుంటారు.  అనుకోకుండా పామును కాళ్లతో తొక్కుతే.. పై ప్రాణాలు పైకే పోతాయి. పోయి పోయి ఎక్కడైన పాము ఉందని తెలిస్తే.. అ పక్కకు వెళ్లడమే మానేస్తాం.. పాము అంటే.. అంతా భయం మరీ. కానీ ఓ బుడ్డోడు ఏకంగా పామును పట్టుకొని బొమ్మలాగా ఆడుకుంటున్నాడు. వారి చేష్టాలకు ఇంట్లో వాళ్లు కూడా జంకుతున్నారు. ప్రస్తుతం ఆ బుడ్డోడి వీడియో  వైరల్ గా మారింది.

ఈ వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పాము ఎంత ప్రమాదకరమైనవో అందరికీ తెలిసిందే. ఒక్కసారి ఆ పాము కాటేస్తే.. కొద్ది నిమిషాల్లో ప్రాణాలు కోల్పోవచ్చు. కానీ.. అలాంటి ప్రమాదకర పామును పిల్లాడు తోక పట్టి లాగుతున్న ఏం అనకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అదేసమయంలో ఆ వీడియో చాలా మందికి కోపం తెప్పించింది. చాలా మంది తల్లిదండ్రులను వారి బాధ్యత గురించి ప్రశ్నించారు.

వివరాల్లోకెళ్తే.. ఇన్‌స్టాగ్రామ్‌లో First_love_addiction అనే వినియోగదారు ఈ  వీడియోను షేర్ చేశారు. వీడియోలో..  ఓ పిల్లవాడు  పామును పట్టుకుని ఇంట్లోకి లాక్కొచే ప్రయత్నం చేశాడు. దీనిని చూసిన  ఇంట్లో వారు షాక్‌ అయ్యారు. మరొలా చెప్పాలంటే.. ఆ పిల్లవాడు చేసిన పనిని భయాందోళనలకు గురయ్యారు. పిల్లవాడు చేసిన పనికి భయంతో ఒక్కసారిగా పైకి లేచి.. పరిగెత్తే ప్రయత్నం చేశారు.  పామును విడిచిపెట్టుమని,  లోపలకు తీసుకురావద్దని బాలుడికి చెప్పడం చూడవచ్చు.

ఇలాంటి భయాందోళన మధ్య  ఓ వ్యక్తి  ధైర్యం చేసి.. ఆ బాలుడి మరో చేయి పట్టుకుని పాముతో సహా ఇంటి బయటకు తీసుకెళ్లాడు. షేర్ చేయబడినప్పటి నుండి ఈ వీడియోను దాదాపు  17 మిలియన్లకు పైగా వీక్షించగా.. ఆరు లక్షలకు పైగా లైక్‌ చేశారు. వేలాది మంది కామెంట్ల రూపంలో తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.  

ప్రధానంగా ఆ పిల్లవాడి తల్లిదండ్రులను విమర్శిస్తున్నారు. పిల్లలు చేసే పనులు పెద్దలు పర్యవేక్షించాలని సూచిస్తున్నారు. "నేను నా మాజీని నా కుటుంబానికి పరిచయం చేసిన రోజును ఈ వీడియో నాకు గుర్తు చేస్తుంది." అని ఒకరు చమత్కరించారు. "జంగిల్ బుక్ విలేజ్ బుక్‌గా మారింది" అని  మరో నెట్టిజన్ కామెంట్ చేశారు. "యంగ్‌ మోగ్లీ చివరకు గ్రామానికి తిరిగి వచ్చాడు" అని ఒక వ్యక్తి కామెంట్ చేశాడు. "అది పామా..? పెయిడ్ యాక్టరా ?"ఒక వ్యక్తి కామెంట్‌ చేశాడు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios