Today's Top Stories: కాంగ్రెస్ ట్రాప్‌లో పడొద్దు.. యూట్యూబర్ పై బర్రెలక్క ఆగ్రహం.. మరో రెండు గ్యారెంటీల అమలు.
Today's Top Stories: శుభోదయం..ఈ రోజు టాప్ సోర్టీస్ లో భారత్ ప్రపంచ శక్తిగా ఎదుగుతోంది.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, యూట్యూబర్ పై బర్రెలక్క తీవ్ర ఆగ్రహం, కాంగ్రెస్ ట్రాప్‌లో పడొద్దు..: కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు, రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. మరో రెండు గ్యారెంటీలు అమలు.. నేటీ నుంచి విశాఖపట్నం వేదికగా రెండో టెస్టు.. ‘సిద్ధం’ భారీ బహిరంగ సభకు ఏలూరు సంసిద్దం, ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్.., నేడే ఢిల్లీలో వైఎస్ షర్మిల దీక్ష వంటి వార్తల సమాహారం.
Today's Top Stories:
‘సిద్ధం’ భారీ బహిరంగ సభకు ఏలూరు సంసిద్దం..
YSRCP Public Meeting: ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో వైసీపీ వ్యూహాలకు మరింత పదును పెడుతోంది. ఈ క్రమంలో ఏలూరు వేదికగా ‘సిద్ధం’ అనే మరో భారీ బహిరంగను నిర్వహించబోతుంది. ఈ నెల 3 న జరుగనున్న ఈ సభలో ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని 50 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి లక్షలాది మంది పాల్గొనున్నడంతో విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్..
AP Assembly Session 2024 : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. మూడు రోజుల పాటు మధ్యంతర బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 5న గవర్నర్ నజీర్ ప్రసంగంతో సెషన్ ప్రారంభమవుతుంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్ కాకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.
నేడే ఢిల్లీలో వైఎస్ షర్మిల దీక్ష
ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలును కోరుతూ కేంద్రంపై ఒత్తిడి పెంచాలని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల భావిస్తోంది. ఇందుకోసం మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాసిన షర్మిల నేడు (శుక్రవారం) ఢిల్లీ లోని జంతర్ మంతర్ వేదికగా దీక్ష చేపట్టనున్నారు. షర్మిలతోపాటు రాష్ట్రానికి చెందిన పార్టీ సీనియర్ నేతలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. ఈ దీక్షకు సీపీఐ, సీపీఎం సహా జాతీయ పార్టీల నాయకుల మద్దతు కోరినట్టు తెలుస్తోంది.కేంద్ర మంత్రులు అమిత్‌షా, నిర్మలా సీతారామన్ అపాయింట్‌మెంట్‌లనూ కోరినట్లు తెలుస్తోంది.
టీడీపీ ఓడితే రాజకీయాల నుంచి తప్పుకుంటాం: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Chandrababu: ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాకుంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. అయితే, టీడీపీ, జనసేన కూటమి తప్పకుండా అధికారంలోకి వస్తుందనే విశ్వాసాన్ని ప్రకటించారు. రిపబ్లిక్ వరల్డ్ అనే జాతీయ మీడియాకు బుధవారం ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారేమీ కాదు. ఇటీవలే ఆయన 2024 అసెంబ్లీ ఎన్నికలే తన చివరి ఎన్నికలు అనీ పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. మరో రెండు గ్యారెంటీలు అమలు..
CM Revanth reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నిక ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో భాగంగా మరో రెండు గ్యారంటీలను అమలు చేద్దామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ లబ్ధి జరిగేలా గ్యారంటీలను అమలు చేస్తామనీ, మరో రెండు గ్యారంటీల అమలుకు సన్నాహాలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన దరఖాస్తులపై గురువారం నాడు డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో కేబినేట్ సబ్ కమిటీ మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.
షబ్బీర్ అలీ ఆసక్తికర వ్యాఖ్యలు
హైదరాబాద్ : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సరిగ్గా రెండు నెలలు కూడా పూర్తికాలేదు ... అప్పుడే ప్రభుత్వం కూలిపోబోతోందంటూ కొందరు ప్రతిపక్ష నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసారు. కాంగ్రెస్ ప్రభుత్వం వుంటుందా, వుండదా అన్నది ఆ పార్టీ వారి చేతుల్లోనే వుందంటూ సంచలన కామెంట్స్ చేసారు. ఇలా రేవంత్ సర్కార్ గురించి మాట్లాడిన మాజీ సీఎంకు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కౌంటర్ ఇచ్చారు.
కాంగ్రెస్ ట్రాప్‌లో పడొద్దు..: కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో పాటు ఫాంహౌస్‌లో జారిపడటంతో తుంటి ఎముకకు గాయమై ఇంటికే పరిమితమైన మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా రోజుల తర్వాత జనంలోకి వచ్చారు. గురువారం శాసనసభలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు వ్యూహరచనతో పాటు అసెంబ్లీ సమావేశాల్లో అనుసురించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పదేళ్ల పాలన సాగించామన్నారు. బీఆర్ఎస్ మాత్రే తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతుందని.. ఓటమితో నిరాశ, భయపడాల్సిన అవసరం లేదని చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు.
యూట్యూబర్ పై బర్రెలక్క తీవ్ర ఆగ్రహం..
Barrelakka: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క తరుచూ వార్తల్లో ఉంటున్నారు. నిన్నా మొన్నటి వరకు బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌తో పెళ్లి అనే ఓ తప్పుడు వార్తపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. తాజాగా, మరోసారి ఆమె వార్తల్లోకి ఎక్కారు. ఇప్పుడు ఓ యూట్యూబర్ పై ఆమె శివాలెత్తుతున్న వీడియో వైరల్ అవుతున్నది.
భారత్ ప్రపంచ శక్తిగా ఎదుగుతోంది.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
India Budget 2024-25: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు సాధించిన విజయాలను గురించి ఆర్థిక మంత్రి ప్రస్తావించారు. సార్వత్రిక ఎన్నికల ఏడాది కావడంతో మధ్యంతర బడ్జెట్ అయిన్పటికీ ఈ బడ్జెట్ పై మరింత ఆసక్తి పెరిగింది. దీనికి తోడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఇదే తొలి మధ్యంతర బడ్జెట్ కావడం విశేషం. లోక్ సభ ఎన్నికలకు మరికొన్ని నెలల సమయం ఉండటంతో ఆర్థిక మంత్రి కూడా ఈ బడ్జెట్ లో పలు భారీ ప్రజాకర్షక ప్రకటనలు చేస్తున్నారు. గత పదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ చాలా సానుకూల మార్పును చూసిందని నిర్మలా సీతారామన్ గురువారం అన్నారు.
నేడే రెండో టెస్టు ప్రారంభం
IND vs ENG: ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు విశాఖపట్నం వేదికగా భారత్- ఇంగ్లండ్ లు రెండో టెస్టు మ్యాచ్ ఆడనున్నాయి. హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో 28 పరుగుల తేడాతో వెనుకబడిన టీమిండియా రెండో మ్యాచ్‌లో పుంజుకుని సిరీస్‌ను సమం చేయాలని భావిస్తోంది. గాయం కారణంగా రెండో టెస్టు మ్యాచ్‌కు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ దూరమయ్యారు. టీమిండియా ఆల్ రౌండర్ జడేజా దూరం కావడంతో స్టార్ స్పిన్ బౌలర్ ఆర్ అశ్విన్ పై పెద్ద బాధ్యత పడనుంది.