నేటి ముఖ్యాంశాలివే

Today Telugu News Live

తెలుగు రాష్ట్రాల్లోని తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, క్రీడా, సినీ, క్రైమ్, బిజినెస్ వార్తలను ఎప్పటికప్పుడు ఏషియానెట్ తెలుగు లైవ్ అఫ్ డేట్స్ ద్వారా అందిస్తున్నాం. జస్ట్ వన్ క్లిక్‌తో నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మీ కోసం...

4:45 PM IST

హిమాచల్ ప్రదేశ్ లో వర్ష బీభత్సం... బీయాస్ నది ఉదృతికి రహదారి కోత

హిమాచల్ ప్రదేశ్ లో కురుస్తున్న భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ లో బియాస్ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో వరదనీటి ఉదృతికి మనాలి-లేహ్ జాతీయ రహదారి కోతకు గురయ్యింది. దీంతో ఎలాంటి ప్రమాదాలు జరక్కుండా ట్రాఫిక్ ను నిలిపివేసారు. 

4:06 PM IST

CWG 2022 : విజేతలకే విజేత పివి సింధు..: ప్రధాని మోదీ ప్రశంసలు

కామన్వెల్త్ గేమ్స్ 2022 బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో భారత షట్లర్ పివి సింధు మరోసారి అద్భత ప్రదర్శన కనబర్చి స్వర్ణ పతకం సాధించింది. ఇలా భారత కీర్తిని మరోసారి విదేశీ గడ్డపై చాటిన సింధకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.  కామన్వెల్త్ లో అద్భత విజయంతో సింధు అసాధ్యురాలే కాదు విజేతలకే విజేత అంటూ పీఎం కొనియాడారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా సింధుకు అభినందనలు తెలిపారు. 

2:57 PM IST

CWG 2022: భారత్ ఖాతాలో మరో స్వర్ణం... ఫైనల్లో అదరగొట్టిన పివి సింధు

కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకం చేరింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ పైనల్లో గెలిచి భారత షట్లర్ పివి సింధు స్వర్ణ పతకం సాధిచింది. ఫైనల్లో కెనడా షట్లర్ మిచెల్లి లి పై 21-15 21-13 తేడాతో విజయం సాధించింది. 

2:13 PM IST

కామన్వెల్త్ గేమ్స్ ముగింపు కార్యక్రమంలో.. బంగారు తల్లి నికత్ జరీన్ కు అరుదైన గౌరవం

కామన్వెల్త్  గేమ్స్ 2022 లో స్వర్ణం సాధించి భారత కీర్తిపతాకాన్ని ప్రపంచ వేదికపై రెపరెపలాడించిన తెలంగాణ బిడ్డ నికత్ జరీన్ కు అరుదైన గౌరవం దక్కింది. యూకేలో జరుగుతున్న కామన్వల్త్ గేమ్స్ ఇవాళ ముగియనున్నాయి. ఈ ముగింపు వేడుకల్లో భారతదేశ జాతీయ పతాకాన్ని చేతబట్టి భారత క్రీడాకారులను ముందుండి నడిపించే అవకాశం దక్కింది. మరో క్రీడాకారుడు శరత్ కమల్ తో కలిసి జరీన్ త్రివర్ణ పతాకదారణ చేయనున్నారు. తెలంగాణకే చెందిన పివి సింధు కామన్వెల్త్ గేమ్ ఆరంభం కార్యక్రమంలో పతాకదారిగా నిలవగా ముగింపు కార్యక్రమంలోనూ తెలంగాణ బిడ్డకే ఆ అరుదైన అవకాశం దక్కింది. 
 
1:26 PM IST

ప్రధాని మోదీని కలిసిన తెలంగాణ కాంగ్రెస్ లీడర్ వీహెచ్

భారత ప్రధాని నరేంద్ర మోదీని పార్లమెంట్ ప్రాంగణంలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ (వి. హన్మంతరావు) కలిసారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ సమక్షంలోనే వీహెచ్ ప్రధానిని కలిసి ఓబిసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. 
 
12:03 PM IST

పశ్చిమ బెంగాల్లో ఘోరం... బస్ యాక్సిడెంట్ లో 40మందికి గాయాలు

పశ్చిమ బెంగాల్ లో ఇవాళ తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. హౌరా జిల్లా బగ్నాన్ కు 70మందితో వెళుతున్న బస్సు చంద్రాపూర్ వద్ద జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 40 మంది తీవ్రంగా గాయపడగా వారిలో  ఐదుగురి పరిస్థితి విషమగా వున్నట్లు తెలుస్తోంది. 

11:14 AM IST

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాను ఆమోదించిన స్పీకర్

ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి కూడా ఇవాళ స్పీకర్ ఫార్మాట్ రాజీనామా చేసారు. తన రాజీనామా లేఖను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అందించగా ఆయన వెంటనే ఈ రాజీనామాను ఆమోదించారు. దీంతో మునుగోడు అసెంబ్లీ స్థానం ఖాళీకాగా త్వరలోనే ఉపఎన్నిక జరగనుంది. 

10:36 AM IST

ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజీనామా...

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని వీడిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజాగా ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసారు. కొద్దిసేపటిక్రితమే గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరుల నివాళులు అర్పించిన కోమటిరెడ్డి అక్కడినుండి అసెంబ్లీకి చేరుకున్నారు. స్పీకర్ ఫార్మాట్ లో తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఓ లేఖతో అసెంబ్లీకి వెళ్లారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి ఈ లేఖను అందించి ఆమోదించాల్సిందిగా కోమటిరెడ్డి కోరనున్నారు.  
 
9:57 AM IST

భారత్ లో 1,35, 510 యాక్టివ్ కేసులు

భారతదేశంలో గత 24గంటల్లో కొత్తగా 16,167 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం దేశంలో  కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1,35,510కి చేరింది. 

9:55 AM IST

రాజస్థాన్ లో ఘోరం... ఆలయంలో తొక్కిసలాట, ముగ్గురు మహిళలు మృతి

రాజస్థాన్ లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. దైవదర్శనానికి వెళ్లిన భక్తులు తొక్కిసలాటలో మృతిచెందారు. సికార్ జిల్లాలోని ఖాతూ శ్యామ్ జీ ఆలయంలో నెలవారి జాతర సందర్భంగా భారీసంఖ్యలో భక్తులు దైవదర్శనానికి వచ్చారు. ఈ క్రమంలోనే ఆలయ ప్రవేశద్వారం వద్ద తొక్కిసలాట జరగ్గా ముగ్గురు మహిళలు మృతిచెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడి జైపూర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. 
 
9:33 AM IST

కేజ్రీవాల్ సర్కార్ పై కామన్వెల్త్ మెడల్ విన్నర్ తీవ్ర వ్యాఖ్యలు

యూకే వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022 లో సత్తా చాటిన భారత బాక్సర్ దివ్య కక్రన్ డిల్లీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. తాను క్రీడాకారిణిగా ఇప్పటివరకు డిల్లీ ప్రభుత్వం నుండి ఎలాంటి సహకారం అందుకోలేదన్నారు. డిల్లీలోనే నివాసముంటున్న తాను అంతర్జాతీయ స్థాయిలో అనేక విజయాలు సాధించినా ప్రభుత్వం గుర్తించలేదని దివ్య తెలిపారు. ఆమె వ్యాఖ్యలపై వెంటనే స్పందించిన కేజ్రీవాల్ ప్రభుత్వం దివ్య ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంనుండి ప్రాతినిధ్యం వహిస్తోందని వెల్లడించారు. 

4:45 PM IST:

హిమాచల్ ప్రదేశ్ లో కురుస్తున్న భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ లో బియాస్ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో వరదనీటి ఉదృతికి మనాలి-లేహ్ జాతీయ రహదారి కోతకు గురయ్యింది. దీంతో ఎలాంటి ప్రమాదాలు జరక్కుండా ట్రాఫిక్ ను నిలిపివేసారు. 

4:06 PM IST:

కామన్వెల్త్ గేమ్స్ 2022 బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో భారత షట్లర్ పివి సింధు మరోసారి అద్భత ప్రదర్శన కనబర్చి స్వర్ణ పతకం సాధించింది. ఇలా భారత కీర్తిని మరోసారి విదేశీ గడ్డపై చాటిన సింధకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.  కామన్వెల్త్ లో అద్భత విజయంతో సింధు అసాధ్యురాలే కాదు విజేతలకే విజేత అంటూ పీఎం కొనియాడారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా సింధుకు అభినందనలు తెలిపారు. 

2:57 PM IST:

కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకం చేరింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ పైనల్లో గెలిచి భారత షట్లర్ పివి సింధు స్వర్ణ పతకం సాధిచింది. ఫైనల్లో కెనడా షట్లర్ మిచెల్లి లి పై 21-15 21-13 తేడాతో విజయం సాధించింది. 

2:13 PM IST:

కామన్వెల్త్  గేమ్స్ 2022 లో స్వర్ణం సాధించి భారత కీర్తిపతాకాన్ని ప్రపంచ వేదికపై రెపరెపలాడించిన తెలంగాణ బిడ్డ నికత్ జరీన్ కు అరుదైన గౌరవం దక్కింది. యూకేలో జరుగుతున్న కామన్వల్త్ గేమ్స్ ఇవాళ ముగియనున్నాయి. ఈ ముగింపు వేడుకల్లో భారతదేశ జాతీయ పతాకాన్ని చేతబట్టి భారత క్రీడాకారులను ముందుండి నడిపించే అవకాశం దక్కింది. మరో క్రీడాకారుడు శరత్ కమల్ తో కలిసి జరీన్ త్రివర్ణ పతాకదారణ చేయనున్నారు. తెలంగాణకే చెందిన పివి సింధు కామన్వెల్త్ గేమ్ ఆరంభం కార్యక్రమంలో పతాకదారిగా నిలవగా ముగింపు కార్యక్రమంలోనూ తెలంగాణ బిడ్డకే ఆ అరుదైన అవకాశం దక్కింది. 
 
1:27 PM IST:

భారత ప్రధాని నరేంద్ర మోదీని పార్లమెంట్ ప్రాంగణంలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ (వి. హన్మంతరావు) కలిసారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ సమక్షంలోనే వీహెచ్ ప్రధానిని కలిసి ఓబిసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. 
 
12:03 PM IST:

పశ్చిమ బెంగాల్ లో ఇవాళ తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. హౌరా జిల్లా బగ్నాన్ కు 70మందితో వెళుతున్న బస్సు చంద్రాపూర్ వద్ద జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 40 మంది తీవ్రంగా గాయపడగా వారిలో  ఐదుగురి పరిస్థితి విషమగా వున్నట్లు తెలుస్తోంది. 

11:14 AM IST:

ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి కూడా ఇవాళ స్పీకర్ ఫార్మాట్ రాజీనామా చేసారు. తన రాజీనామా లేఖను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అందించగా ఆయన వెంటనే ఈ రాజీనామాను ఆమోదించారు. దీంతో మునుగోడు అసెంబ్లీ స్థానం ఖాళీకాగా త్వరలోనే ఉపఎన్నిక జరగనుంది. 

10:36 AM IST:

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని వీడిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజాగా ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసారు. కొద్దిసేపటిక్రితమే గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరుల నివాళులు అర్పించిన కోమటిరెడ్డి అక్కడినుండి అసెంబ్లీకి చేరుకున్నారు. స్పీకర్ ఫార్మాట్ లో తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఓ లేఖతో అసెంబ్లీకి వెళ్లారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి ఈ లేఖను అందించి ఆమోదించాల్సిందిగా కోమటిరెడ్డి కోరనున్నారు.  
 
9:57 AM IST:

భారతదేశంలో గత 24గంటల్లో కొత్తగా 16,167 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం దేశంలో  కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1,35,510కి చేరింది. 

9:55 AM IST:

రాజస్థాన్ లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. దైవదర్శనానికి వెళ్లిన భక్తులు తొక్కిసలాటలో మృతిచెందారు. సికార్ జిల్లాలోని ఖాతూ శ్యామ్ జీ ఆలయంలో నెలవారి జాతర సందర్భంగా భారీసంఖ్యలో భక్తులు దైవదర్శనానికి వచ్చారు. ఈ క్రమంలోనే ఆలయ ప్రవేశద్వారం వద్ద తొక్కిసలాట జరగ్గా ముగ్గురు మహిళలు మృతిచెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడి జైపూర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. 
 
9:33 AM IST: