నేటి వార్తల్లోని ముఖ్యాంశాలివే

Today Telugu News Live

తెలుగు రాష్ట్రాల్లోని తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, క్రీడా, సినీ, క్రైమ్, బిజినెస్ వార్తలను ఎప్పటికప్పుడు ఏషియానెట్ తెలుగు లైవ్ అఫ్ డేట్స్ ద్వారా అందిస్తున్నాం. జస్ట్ వన్ క్లిక్‌తో నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మీ కోసం...

9:27 PM IST

సమిష్టి కృషితోనే కరోనా కట్టడి: నీతి ఆయోగ్ సమావేశంలో మోడీ

సమిష్టి కృషితోనే కరోనా మహమ్మారిని అడ్డుకోగలిగామని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆదివారం జరిగిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ భేటీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థంగా చర్యలు తీసుకున్నాయని ప్రధాని ప్రశంసించారు. ఇదే సమావేశంలో ప్రధాని మోడీ ముందు ముఖ్యమంత్రులు పలు ప్రతిపాదనలు వుంచారు. 

8:30 PM IST

మోడీకి రాఖీ పంపిన పాకిస్తాన్ సోదరి

రక్షా బంధన్ పర్వదినం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీకి పాకిస్తాన్ సోదరి కమార్ మోసిన్ షేక్ రాఖీ పంపారు. రేష్మీ రిబ్బన్, ఎంబ్రాయిడరీ డిజైన్స్‌తో ఆమె సొంతంగా తయారు చేశారు. 2024 జనరల్ ఎన్నికల్లోనూ మోడీ మరోసారి విజయం సాధించాలని కమార్ ఆకాంక్షించారు. 

7:46 PM IST

కామన్‌వెల్త్ గేమ్స్ : బాక్సింగ్‌లో నిఖత్ జరీన్‌కు స్వర్ణం

కామన్‌వెల్త్ గేమ్స్‌లో తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ సత్తా చాటింది. ఆదివారం బాక్సింగ్ ఫైనల్స్ లో జరీన్ బంగారు పతకం సాధించింది. మహిళల  లైట్  ఫ్లైయిట్  50 కిలలో విభాగంలో  నిఖత్.. నార్తర్న్ ఐర్లాండ్ బాక్సర్ కార్లీ మెక్‌నాల్ మీద గెలిచింది. ఫైనల్ బౌట్ లో మన నిజామాబాద్ అమ్మాయి.. 5-0 తేడాతో స్వర్ణాన్ని సాధించింది.

7:11 PM IST

తెలంగాణలో ముగిసిన ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష

తెలంగాణలో ఎస్ఐ ప్రిలిమినరీ రాత పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. 544 పోస్టుల కోసం ఏప్రిల్ 25న నోటిఫికేషన్ విడుదల కాగా.. 2,47,217 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 2,25,759 మంది పరీక్షకు హాజరయ్యారు. త్వరలోనే ప్రిలిమినరీ పరీక్ష ‘‘కీ’’ని తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వెబ్‌సైట్‌లో వుంచుతామని అధికారులు తెలిపారు

6:28 PM IST

బంగాళాఖాతంలో వాయుగుండం... ఏపీకి వర్ష సూచన

ఆంధ్రప్రదేశ్‌కు వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది . వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఒడిషా- ఉత్తరాంధ్ర తీరాల వెంబడి అల్పపీడనం ఏర్పడింది. వచ్చే 48 గంటల్లో అదే ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశాలు వున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. ఈ నేపథ్యంలో మత్స్యాకారులు వేటకు వెళ్లరాదని ప్రభుత్వం హెచ్చరించింది. 

5:46 PM IST

కామన్వెల్త్ గేమ్స్ : ట్రిపుల్ జంప్‌లో భారత్‌కు గోల్డ్, సిల్వర్

కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా పురుషుల ట్రిపుల్ జంప్ విభాగంలో భారత్‌కు పసిడి, రజత పతకాలు దక్కాయి. ఎల్దోస్ పాల్‌కు బంగారం పతకం, అబ్ధుల్లా అబూబకర్‌ రజతప తకం సాధించారు. 

5:03 PM IST

రద్దయిన సీయూఈటీ- యూజీ పరీక్ష కొత్త తేదీలివే

ఆగస్ట్ 4న వాయిదాపడిన సీయూఈటీ యూజీ పరీక్షను ఈ నెల 24, 28 తేదీల మధ్య నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. ఈ మేరకు కొత్త అడ్మిట్ కార్డులు జారీ చేస్తామని వెల్లడించింది. దేశంలోని విశ్వవిద్యాలయాల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశం కోసం ఆగస్ట్ 4న ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించారు. అయితే అప్పుడు కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా దేశవ్యాప్తంగా 489 కేంద్రాల్లో రెండో విడత పరీక్ష రద్దయిన సంగతి తెలిసిందే. 

3:59 PM IST

కామన్వెల్త్ గేమ్స్ : బాక్సింగ్‌లో భారత్‌కు స్వర్ణం

భారీ అంచనాలతో బర్మింగ్‌హమ్‌లో అడుగుపెట్టిన భారత స్టార్ బాక్సర్ అమిత్ పంగల్ స్వర్ణం గెలిచాడు. 51 కేజీల విభాగంలో పోటీపడిన అమిత్ పంగల్, ఇంగ్లాండ్ బాక్సర్‌ కియరన్ మెక్‌డొనాల్డ్‌పై అద్భుత విజయం అందుకుని.. భారత్ స్వర్ణ పతకాల సంఖ్యను 15కి పెంచాడు... 2018 గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం గెలిచిన అమిత్ పంగల్, ఈసారి ఏకంగా గోల్డ్ గెలిచి తన రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు... 

3:20 PM IST

కామన్వెల్త్ గేమ్స్‌ : ఫైనల్‌కు చేరిన పీవీ సింధు

కామన్వెల్త్ గేమ్స్ ‌బ్యాడ్మింటన్ ఫైనల్స్‌లో పీవీ సింధు ఫైనల్‌కు చేరారు. సింగపూర్‌కు చెందిన షట్లర్‌పై వరుస సెట్లలో ఆమె విజయం సాధించారు. జియామిన్‌పై 21-19, 21-17 తేడాతో సింధు గెలుపొందారు. 

2:42 PM IST

టీఆర్ఎస్‌కు ఎర్రబెల్లి ప్రదీప్ రావు రాజీనామా

తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ప్రదీప్ రావు టీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. గత కొంతకాలంగా పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో వున్న ఆయన.. ఆదివారం తెలంగాణ రాష్ట్ర సమితికి రాజీనామా చేస్తున్నట్లు వరంగల్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. ఏ పార్టీ ఆదరిస్తే ఆ పార్టీకి వెళ్తానని.. లేదంటే ఇండిపెండెంట్‌గా వుంటానని ప్రదీప్ రావు వెల్లడించారు. 

12:10 PM IST

పూరీ జగన్నాథ ఆలయ వంటశాలలో అగ్నిప్రమాదం

ఒడిషాలోని ప్రముఖ హిందూ దేవాలయమైన పూరీ జగన్నాథుడి సన్నిధిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జగన్నాథుడికి మహా ప్రసాదాన్ని తయారుచేసే వంటశాలలో వంటసామాగ్రిని దాచే గదిలో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ఆలయ సిబ్బంది ఫైర్ సిబ్బంది సాయంతో మంటలను అదుపుచేసారు. 

11:08 AM IST

అప్ఘాన్ లో బాంబు పేలుళ్లు... 8 మంది మృతి, 28మందికి గాయాలు

తాలిబన్ పాలిత అప్ఘానిస్తాన్ లో ముష్కరమూకలు మరోసారి రెడ్డిపోయారు. కాబూల్ లో బాంబు పేళ్ళకు పాల్పడటంతో ఎనిమిదిమంది అమాయక ప్రజలు మృతిచెందారు. మరో 28 మంది తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా వుండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. 
 
10:10 AM IST

ఎస్ఎస్ ఎల్వీ - డి1 ప్రయోగంపై సందిగ్దం... శాటిలైట్స్ నుండి నో సిగ్నల్: ఇస్రో చీఫ్ ప్రకటన

శ్రీహరికోట నుండి ప్రయోగించిన ఎస్ఎస్ ఎల్వీ - డి1 రాకెట్ ప్రయోగంపై సంధిగ్దత నెలకొంది. రెండు శాటిలైట్ల నుండి కంట్రోల్ సెంటర్ కు సిగ్నల్స్ అందడంలేదని ఇస్రో చీఫ్ సోమనాథ్ ప్రకటించారు. ఎస్ఎస్ ఎల్వీ అన్ని దశల్లోనూ అనుకున్నట్లే విజయవంతంగా ముందుకు సాగిందని... కానీ సాకేంతిక లోపం కారణంగా శాటిలైట్స్ నుండి సిగ్నల్స్  అందడంలేదన్నారు. రాకెట్ గమనాన్ని విశ్లేషిస్తున్నామని ఇస్రో చీఫ్ వెల్లడించారు. 

9:27 AM IST

యూపీలో వివాహితపై గ్యాంగ్ రేప్... వీడియో తీసి అత్తింటివారికి వాట్సాప్

ఉత్తరప్రదేశ్ లో దారుణం వెలుగుచూసింది. అంగన్వాడి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోడానికి వెళ్ళిన మహిళపై ఇంటర్నెట్ సెంటర్ యజమాని, కంప్యూటర్ ఆపరేటర్, ఓ షాప్ యజమాని సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన మధురలో చోటుచేసుకుంది. వివాహితపై అత్యాచారానికి పాల్పడుతూ వీడియో తీసి మహిళ అత్తింటివారికి వాట్సాప్ చేసారు. ఈ అమానుషంపై ఫిర్యాదు అందుకున్న  పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసారు. 
 
9:27 PM IST:

సమిష్టి కృషితోనే కరోనా మహమ్మారిని అడ్డుకోగలిగామని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆదివారం జరిగిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ భేటీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థంగా చర్యలు తీసుకున్నాయని ప్రధాని ప్రశంసించారు. ఇదే సమావేశంలో ప్రధాని మోడీ ముందు ముఖ్యమంత్రులు పలు ప్రతిపాదనలు వుంచారు. 

8:30 PM IST:

రక్షా బంధన్ పర్వదినం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీకి పాకిస్తాన్ సోదరి కమార్ మోసిన్ షేక్ రాఖీ పంపారు. రేష్మీ రిబ్బన్, ఎంబ్రాయిడరీ డిజైన్స్‌తో ఆమె సొంతంగా తయారు చేశారు. 2024 జనరల్ ఎన్నికల్లోనూ మోడీ మరోసారి విజయం సాధించాలని కమార్ ఆకాంక్షించారు. 

7:46 PM IST:

కామన్‌వెల్త్ గేమ్స్‌లో తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ సత్తా చాటింది. ఆదివారం బాక్సింగ్ ఫైనల్స్ లో జరీన్ బంగారు పతకం సాధించింది. మహిళల  లైట్  ఫ్లైయిట్  50 కిలలో విభాగంలో  నిఖత్.. నార్తర్న్ ఐర్లాండ్ బాక్సర్ కార్లీ మెక్‌నాల్ మీద గెలిచింది. ఫైనల్ బౌట్ లో మన నిజామాబాద్ అమ్మాయి.. 5-0 తేడాతో స్వర్ణాన్ని సాధించింది.

7:11 PM IST:

తెలంగాణలో ఎస్ఐ ప్రిలిమినరీ రాత పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. 544 పోస్టుల కోసం ఏప్రిల్ 25న నోటిఫికేషన్ విడుదల కాగా.. 2,47,217 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 2,25,759 మంది పరీక్షకు హాజరయ్యారు. త్వరలోనే ప్రిలిమినరీ పరీక్ష ‘‘కీ’’ని తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వెబ్‌సైట్‌లో వుంచుతామని అధికారులు తెలిపారు

6:28 PM IST:

ఆంధ్రప్రదేశ్‌కు వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది . వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఒడిషా- ఉత్తరాంధ్ర తీరాల వెంబడి అల్పపీడనం ఏర్పడింది. వచ్చే 48 గంటల్లో అదే ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశాలు వున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. ఈ నేపథ్యంలో మత్స్యాకారులు వేటకు వెళ్లరాదని ప్రభుత్వం హెచ్చరించింది. 

5:46 PM IST:

కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా పురుషుల ట్రిపుల్ జంప్ విభాగంలో భారత్‌కు పసిడి, రజత పతకాలు దక్కాయి. ఎల్దోస్ పాల్‌కు బంగారం పతకం, అబ్ధుల్లా అబూబకర్‌ రజతప తకం సాధించారు. 

5:03 PM IST:

ఆగస్ట్ 4న వాయిదాపడిన సీయూఈటీ యూజీ పరీక్షను ఈ నెల 24, 28 తేదీల మధ్య నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. ఈ మేరకు కొత్త అడ్మిట్ కార్డులు జారీ చేస్తామని వెల్లడించింది. దేశంలోని విశ్వవిద్యాలయాల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశం కోసం ఆగస్ట్ 4న ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించారు. అయితే అప్పుడు కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా దేశవ్యాప్తంగా 489 కేంద్రాల్లో రెండో విడత పరీక్ష రద్దయిన సంగతి తెలిసిందే. 

3:59 PM IST:

భారీ అంచనాలతో బర్మింగ్‌హమ్‌లో అడుగుపెట్టిన భారత స్టార్ బాక్సర్ అమిత్ పంగల్ స్వర్ణం గెలిచాడు. 51 కేజీల విభాగంలో పోటీపడిన అమిత్ పంగల్, ఇంగ్లాండ్ బాక్సర్‌ కియరన్ మెక్‌డొనాల్డ్‌పై అద్భుత విజయం అందుకుని.. భారత్ స్వర్ణ పతకాల సంఖ్యను 15కి పెంచాడు... 2018 గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం గెలిచిన అమిత్ పంగల్, ఈసారి ఏకంగా గోల్డ్ గెలిచి తన రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు... 

3:20 PM IST:

కామన్వెల్త్ గేమ్స్ ‌బ్యాడ్మింటన్ ఫైనల్స్‌లో పీవీ సింధు ఫైనల్‌కు చేరారు. సింగపూర్‌కు చెందిన షట్లర్‌పై వరుస సెట్లలో ఆమె విజయం సాధించారు. జియామిన్‌పై 21-19, 21-17 తేడాతో సింధు గెలుపొందారు. 

2:42 PM IST:

తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ప్రదీప్ రావు టీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. గత కొంతకాలంగా పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో వున్న ఆయన.. ఆదివారం తెలంగాణ రాష్ట్ర సమితికి రాజీనామా చేస్తున్నట్లు వరంగల్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. ఏ పార్టీ ఆదరిస్తే ఆ పార్టీకి వెళ్తానని.. లేదంటే ఇండిపెండెంట్‌గా వుంటానని ప్రదీప్ రావు వెల్లడించారు. 

12:10 PM IST:

ఒడిషాలోని ప్రముఖ హిందూ దేవాలయమైన పూరీ జగన్నాథుడి సన్నిధిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జగన్నాథుడికి మహా ప్రసాదాన్ని తయారుచేసే వంటశాలలో వంటసామాగ్రిని దాచే గదిలో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ఆలయ సిబ్బంది ఫైర్ సిబ్బంది సాయంతో మంటలను అదుపుచేసారు. 

11:08 AM IST:

తాలిబన్ పాలిత అప్ఘానిస్తాన్ లో ముష్కరమూకలు మరోసారి రెడ్డిపోయారు. కాబూల్ లో బాంబు పేళ్ళకు పాల్పడటంతో ఎనిమిదిమంది అమాయక ప్రజలు మృతిచెందారు. మరో 28 మంది తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా వుండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. 
 
10:10 AM IST:

శ్రీహరికోట నుండి ప్రయోగించిన ఎస్ఎస్ ఎల్వీ - డి1 రాకెట్ ప్రయోగంపై సంధిగ్దత నెలకొంది. రెండు శాటిలైట్ల నుండి కంట్రోల్ సెంటర్ కు సిగ్నల్స్ అందడంలేదని ఇస్రో చీఫ్ సోమనాథ్ ప్రకటించారు. ఎస్ఎస్ ఎల్వీ అన్ని దశల్లోనూ అనుకున్నట్లే విజయవంతంగా ముందుకు సాగిందని... కానీ సాకేంతిక లోపం కారణంగా శాటిలైట్స్ నుండి సిగ్నల్స్  అందడంలేదన్నారు. రాకెట్ గమనాన్ని విశ్లేషిస్తున్నామని ఇస్రో చీఫ్ వెల్లడించారు. 

9:27 AM IST: