ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ జ‌రుగుతున్న క్ర‌మంలో గురువారం క్వాడ్ నాయకుల వర్చువల్ సమావేశం గురువారం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో భారత్ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడా పాల్గొంటున్నారు. 

ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ జ‌రుగుతున్న క్ర‌మంలో గురువారం క్వాడ్ (Quad) నాయకుల వర్చువల్ సమావేశం (virtual meeting)లో ప్రధాని నరేంద్ర మోడీ (prime minister narendra modi) పాల్గొన‌నున్నారు. ఈ స‌మావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ (Joe Biden), ఆస్ట్రేలియా (Australia), జపాన్ (Japan) ప్రధాన మంత్రులతో కలిసి ఈ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఇందులో ఇండో-పసిఫిక్‌లో ముఖ్యమైన పరిణామాలపై అభిప్రాయాలు, సూచ‌న‌లను నాయకులు పరస్పరం పంచుకుంటారని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తెలిపింది.

క్వాడ్ నాయకులు గత ఏడాది సెప్టెంబర్‌లో వాషింగ్టన్‌ (Washington) లో వ్యక్తిగత శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించారు. ‘‘ మార్చి 3న జరిగే క్వాడ్ లీడర్స్ వర్చువల్ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ (Joe Biden), ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ (Scott Morrison), జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడా (Fumio Kishida)తో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు ’’ కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. వాషింగ్టన్ DCలో సెప్టెంబర్ 2021 సమ్మిట్ తర్వాత నాయకులు వారి సంభాషణను కొనసాగించడానికి ఇదో అవకాశం అని చెప్పింది. క్వాడ్ సమకాలీన, సానుకూల ఎజెండాలో భాగంగా ప్రకటించిన నాయకుల కార్యక్రమాలను అమలు చేయడానికి కొనసాగుతున్న ప్రయత్నాలను కూడా వారు సమీక్షిస్తార‌ని తెలిపింది. 

గతే ఏడాది మార్చిలో జో బిడెన్ వర్చువల్ ఫార్మాట్‌లో క్వాడ్ లీడర్‌ల మొట్టమొదటి శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇచ్చారు, ఆ తర్వాత సెప్టెంబర్‌లో వాషింగ్టన్‌లో వ్యక్తిగత శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోదీ అమెరికా వెళ్లారు. వ్యాక్సిన్‌లను ఉత్పత్తి చేయడం, కనెక్టివిటీ ప్రాజెక్ట్‌లు, విద్యార్థుల చైతన్యాన్ని సులభతరం చేయడం, స్టార్టప్‌లు, సాంకేతిక సహకారాన్ని ప్రోత్సహించడం వంటి రంగాలలో సహకారంపై క్వాడ్ దృష్టి సారించింది. 2022 చివరి నాటికి ఇండో-పసిఫిక్ ప్రాంతానికి 100 కోట్ల డోసుల వ్యాక్సిన్‌లను అందించాలనే లక్ష్యంతో క్వాడ్ వ్యాక్సిన్ భాగస్వామ్యం గత ఏడాది మార్చిలో ప్ర‌క‌టించింది. క్వాడ్ గ్రూపింగ్‌కు చెందిన విదేశాంగ మంత్రులు గత నెలలో మెల్‌బోర్న్‌ (Melbourne)లో విస్తృత చర్చలు జరిపారు.