భారత్ ఎప్పుడూ శాంతిని కోరుకుంటుందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ఉక్రెయిన్, రష్యాకు మధ్య నెలకొన్న వివాదాన్ని దౌత్య మార్గంలో పరిష్కరించడానికి భారత్ అనుకూలంగా ఉందని అన్నారు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ తో ఆయన శుక్రవారం భేటీ అయ్యారు. 

ర‌ష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ (Russian Foreign Minister Sergey Lavrov)కు, భార‌త విదేశాంగ మంత్రి ఎస్ జ‌య‌శంక‌ర్ (S Jaishankar ) కు మ‌ధ్య శుక్ర‌వారం స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశం అంత‌ర్జాతీయ వాతావ‌ర‌ణం స‌రిగా లేని స‌మ‌యంలో జ‌రుగుతోంద‌ని ఇద్ద‌రు మంత్రులు అంగీక‌రించారు. ఈ స‌మావేశం సంద‌ర్భంగా రెండు దేశాలకు మ‌ధ్య పలు ఒప్పందాలు జ‌రిగాయి. అలాగే ఇరు దేశాల సంబంధాల‌పై నాయ‌కులు చ‌ర్చించుకున్నారు. ఈ స‌మావేశం సంద‌ర్భంగా జ‌య‌శంకర్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ (ukraine), ర‌ష్యా (russia)కు నెల‌కొన్న వివాదాన్ని దౌత్యం ద్వారా ప‌రిష్క‌రించేందుకు భార‌త్ సిద్ధంగా ఉంద‌ని తెలిపారు. చ‌ర్చల ద్వారా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవ‌చ్చ‌ని చెప్పారు. 

రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ మాట్లాడుతూ.. భారతదేశం, రష్యా ద్వైపాక్షిక సంబంధాల చరిత్రలో స్నేహ‌మే ప్ర‌ధాన‌మైన ప‌దం అని అన్నారు. ‘‘ మా స్థానం ఏంటో మీకు తెలుసు. మేము ఏమీ దాచము. భారతదేశం ఈ పరిస్థితిని పూర్తి వాస్తవాలతో తీసుకుంటుంన్నందుకు మేము అభినందిస్తున్నాము ’’ అని లావ్‌రోవ్ అన్నారు. 

బ్రిటీష్ విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్ (ritish Foreign Secretary Liz Truss) తో గురువారం జరిగిన సమావేశంలో జైశంకర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రష్యా “బహుధృవ ప్రపంచం” వైపు చూస్తోందని ఆయన అన్నారు. రష్యా విదేశాంగ మంత్రి లావ్‌రోవ్ రెండు రోజుల అధికారిక పర్యటన కోసం గురువారం న్యూఢిల్లీ (new delhi)కి వచ్చారు. గత నెలలో రష్యా, ఉక్రెయిన్ పై దాడి చేసిన త‌రువాత ఆయ‌న ఇండియా (india)కు రావ‌డం ఇదే మొదటిసారి. 

ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడి చేయ‌డం ప్రారంభించిన త‌రువాత ఫిబ్రవరి 24న మొద‌టి సారిగా వ్లాదిమిర్ పుతిన్ (vladimir putin)తో ప్ర‌ధాని నరేంద్ర మోడీ ఫోన్ (prime minister narendra modi)లో మాట్లాడారు. చ‌ర్చ‌ల ద్వారా స‌మ‌స్య ప‌రిష్క‌రించుకోవాల‌ని సూచించారు. అనంత‌రం మార్చి 2, మార్చి 7వ తేదీన మ‌ళ్లీ మాట్లాడారు. అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడు (ukraine president) వోలోడిమిర్ జెలెన్స్కీ (volodymyr zelensky)తో మోదీ రెండుసార్లు మాట్లాడారు.

గత వారం పార్ల‌మెంట్ స‌మావేశాల్లో (parliament sessions) విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ వివాదంపై భారత్ వైఖ‌రి దృఢంగా, స్థిరంగా ఉంద‌ని అన్నారు. హింసను తక్షణమే నిలిపివేయాలని కోరుతోంద‌ని అన్నారు. భార‌త్ ఎప్పుడూ శాంతివైపే నిల‌బ‌డుతోంద‌ని అన్నారు. ఉక్రెయిన్ (ukraine), ర‌ష్యా (russia)కు మ‌ధ్య నెల‌కొన్న సంక్షోభాన్ని తొల‌గించేందుకు భార‌త్ ప్ర‌య‌త్నించింద‌ని చెప్పారు. ఇరు దేశాల అధ్య‌క్షుల‌తో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ (prime minister narendra modi) ఫోన్ లో సంభాషించార‌ని తెలిపారు. రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య నెలకొన్న సమస్య భారత్ తన సమస్యలాగే భావిస్తుందని జయశంకర్ అన్నారు. భారత్ శాంతి వైపే ఉంటుంద‌ని, ఇప్పుడూ మ‌న‌ది అదే స్థానం అని తెలిపారు. 2022 ఫిబ్రవరి నెల‌ నుంచి ఉక్రెయిన్ నుంచి 22,500 మంది భారతీయ పౌరులను, 147 మంది విదేశీయులను ప్రభుత్వం సురక్షితంగా ఇంటికి తీసుకొచ్చింద‌ని అన్నారు.