Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో విజృంభిస్తున్న కరోనా.. సరిహద్దు గోడకట్టిన తమిళనాడు

పీలో కరోనా కేసులు పెరుగుతుండడంతో  తమిళనాడు సరిహద్దును మూసేసింది. దీంతో నిత్యావసర సరుకుల లారీల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 
 

TN seals border with Chittoor in Andhra,builds wall on inter-state highway
Author
Hyderabad, First Published Apr 27, 2020, 1:34 PM IST

తమిళనాడు అధికారులు ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర సరిహద్దులో గోడ కట్టారు. పలమనేరు- గుడియాతం రోడ్డుపై సైనిగుంట దగ్గర ఇటుకలతో రోడ్డును మూసివేశారు. 3 అడుగుల వెడల్పు..4 అడుగుల ఎత్తుతో గోడ కట్టారు. ఏపీలో కరోనా కేసులు పెరుగుతుండడంతో  తమిళనాడు సరిహద్దును మూసేసింది. దీంతో నిత్యావసర సరుకుల లారీల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 

ఇదిలా ఉండగా.. ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 80 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1177కు చేరుకుంది. వీరిలో ఇప్పటి వరకు 235 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 31 మంది మరణించారు. 

గత 24 గంటల్లో గుంటూరు జిల్లాలో 23, కృష్ణా జిల్లాలో 33, కర్నూలు జిల్లాలో 13, నెల్లూరు జిల్లాలో 7, శ్రీకాకుళం ఒక కేసులు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో కొత్తగా మూడు కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ కేసుల నమోదులో 292 కేసులతో కర్నూలు జిల్లా అగ్రస్థానంలో కొనసాగుతోంది. 

గుంటూరు జిల్లా 237 కేసులతో రెండో స్థానంలో కొనసాగుతోంది.

అయితే, కృష్ణా జిల్లాలో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. తాజాగా కృష్ణా జిల్లాలో 33 కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 210కి చేరుకుంది. 

కొత్తగా అనంతపురం, చిత్తూరు, తూర్పు గోదావరి, ప్రకాశం, కడప, విశాఖపట్నం జిల్లాల్లో కేసులు నమోదు కాలేదు. విజయనగరం జిల్లా ఇప్పటికీ కరోనా ఫ్రీగా ఉంది. శ్రీకాకుళం జిల్లాలో మరో కేసు నమోదు కావడంతో సంఖ్య 4కు చేరకుంది.

ఇలా కేసులు అధిక సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలోనే.. తమ రాష్ట్రానికి కూడా ప్రమాదం పొంచి ఉందనే భావనతో తమిళనాడు ప్రభుత్దం సరిహద్దులు మూసివేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios