లాక్ డౌన్ మరో వారం పాటు పొడిగిస్తూ తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో జూన్ 14వరకు తమిళనాడులో లాక్ డౌన్ కొనసాగనుంది. అయితే నిబంధనల్లో కొంత వెసులుబాటుతో ఈ లాక్ డౌన్ కొనసాగుతుందని ప్రకటించారు. 

కాగా, మే 10 నుంచి తమిళనాడులో లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 
రాష్ట్రంలో కోవిడ్ 19 సంక్రమణ వ్యాప్తిని ఆపడానికి తమిళనాడు మొదటివిడతగా 14రోజులపాటు పూర్తి లాక్ డౌన్ విదించింది. గత కొన్ని రోజులుగా కోవిడ్ 19 కేసులు పెరగడంతో తమిళనాడు ప్రభుత్వం మే 10 నుంచి 24 వరకు రాష్టరంలో పూర్తి లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 

తమిళనాడులో లాక్ డౌన్ ప్రకటించిన ప్రభుత్వం, కోవిడ్ 19 కేసులు పెరగడం వల్ల రాష్ట్రంలో అనివార్యమైన పరిస్థితుల కారణంగా షట్ డౌన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీసుకున్న మొదటి ప్రధాన నిర్ణయాల్లో లాక్ డౌన్ ఒకటి.