జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్యతో అగ్నిపథ్ స్కీంకు లంకె పెడుతున్నారు. అబే హంతకుడు మూడేళ్లు జపాన్ నేవీలో పని చేసి రిటైర్ అయ్యాడని, ఆయనకు కూడా పెన్షన్ అందడం లేదని ఇండియా టుడే కథనం పేర్కొంది. ఇక్కడ అగ్నిపథ్ స్కీం కూడా షార్ట్ సర్వీస్ ఉద్యోగమేనని, అగ్నివీరులకు రెగ్యులర్ పెన్షన్ ఉండదని వివరించింది. 

న్యూఢిల్లీ: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్యను అగ్నిపథ్ స్కీంతో లింక్ పెట్టి తృణమూల్ కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసింది. టీఎంసీ మౌత్‌పీస్ జాగో బంగ్లా పత్రికలో ఫ్రంట్ పేజీలో స్టోరీ ప్రచురితం చేసింది. అందులో షింజో అబే హంతకుడిని ఫ్రస్ట్రేషనర్‌ను అగ్నిపథ్ స్కీం లోపాలతో లింక్ పెట్టింది. 

జపాన్ మాజీ ప్రధాని షింజో అబేను హత్య చేసిన తెత్సుయా యమగామి ఆ దేశ నేవీలో చేరి మూడేళ్లు మాత్రమే చేసి వచ్చాడని, ఆయనకు పెన్షన్ రాలేదని పేర్కొంది. జపాన్‌లోనూ అగ్నిపథ్ స్కీం వంటిదే ఒక షార్ట్ సర్వీస్ స్కీం ఉన్నదని వివరించింది.

తెత్సుయా యమగామి జపాన్ మేరీటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సెస్‌.. జపనీస్ నేవీలో మూడేళ్లు పని చేశాడు. ఈ జపనీస్ మేరీటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సెస్‌ను అగ్నిపథ్ స్కీంతో ఈ టీఎంసీ మౌత్ పీస్ పోల్చింది. అగ్నిపథ్ స్కీం ద్వారా మోడీ ప్రభుత్వం యువతను నాలుగేళ్లు మిలిటరీలో పని చేయించుకుని.. ఆ తర్వాత పెన్షన్, ఇతర రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ లేకుండానే ఇంటికి పంపించాలని ఆలోచిస్తున్నదని వివరించింది.

Scroll to load tweet…

మీడియా కథనాల ప్రకారం, షింజో అబే హంతకుడు తెత్సుయా యమగామి మూడేళ్లు జపనీస్ నేవీలో షార్ట్ సర్వీస్‌లో పని చేశాడు. ఆ తర్వాత నిరుద్యోగిగా మారిపోయాడు. అతనికి పెన్షన్ కూడా అందడం లేదు. తెత్సుయా యమగామి నిరుద్యోగిగా మారడం, పింఛన్ కూడా రాకపోవడం కారణంగా ఫ్రస్ట్రేషన్‌కు గురై షింజో అబేను టార్గెట్ చేసి చంపేశాడని ఆ కథనాలు తెలిపాయి.

జపనీస్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సెస్.. జపనీస్ మిలిటరీ ఫోర్సెస్‌లో భాగమే. ఇందులో జపాన్ గ్రౌండ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్, జపనీస్ మేరీటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్, జపాన్ ఎయిర్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్‌లు ఉంటాయి. జపనీస్ డిఫెన్స్ ఫోర్సెస్‌ నుంచి రిటైర్‌మెంట్ తర్వాత వన్ టైమ్ పేమెంట్ అందుతుంది. ఆ తర్వాత రెగ్యులర్‌గా పెన్షన్ ఉండని స్కీం అది.

షింజో అబే హత్యలో అగ్నిపథ్ నీడలు ఉన్నాయని జాగో బంగ్లా పత్రిక శీర్షిక ఉన్నదని ఓ పాత్రికేయుడు ట్వీట్ చేశాడు. జపాన్ మేరీటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్‌లో హంతకుడు మూడేళ్లు పని చేశాడని, అగ్నిపథ స్కీంలో లాగే.. అక్కడ కూడా ఇందులో పని చేసిన వారికి పింఛన్ ఉండదు అని పేర్కొన్నాడు. షింజో అబే హంతకుడు జపాన్ ఎస్‌డీఎఫ్ అనే ఆర్మీలో పెన్షన్ లేకుండా పని చేసి రిటైర్ అయ్యాడని కాంగ్రెస్ నేత సురేంద్ర రాజ్‌పుత్ ట్వీట్ చేశారు.