Asianet News TeluguAsianet News Telugu

నందిగ్రామ్‌ నుండి మమత పోటీ: 291 మందితో టీఎంసీ అభ్యర్ధుల జాబితా

పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ నేత మమత బెనర్జీ 291 మంది అభ్యర్ధులతో శుక్రవారంనాడు జాబితాను విడుదల చేశారు.

TMC Releases Full List of 291 Candidates For West Bengal Assembly Election 2021 lns
Author
Kolkata, First Published Mar 5, 2021, 3:09 PM IST

కోల్‌కత్తా:పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ నేత మమత బెనర్జీ 291 మంది అభ్యర్ధులతో శుక్రవారంనాడు జాబితాను విడుదల చేశారు.తొలి జాబితాలో ప్రకటించిన 291 మందిలో 50 మంది మహిళలు, 42 మంది ముస్లింలకు టీఎంసీ సీట్లను కేటాయించింది.నార్త్ బెంగాల్ లోని మూడు స్థానాలకు టీఎంసీ అభ్యర్ధులను ప్రకటించలేదు.

నందిగ్రామ్ స్థానం నుండి పోటీ చేస్తానని మమత బెనర్జీ ప్రకటించారు. ఈ స్థానం నుండి తాను పోటీ చేసి మమతను 50 వేల ఓట్లతో ఓడిస్తానని మాజీ టీఎంసీ నేత సువేంధు అధికారి ప్రకటించిన విషయం తెలిసిందే.పార్టీలోని 80 ఏళ్లు దాటిన వారికి మమత టిక్కెట్టు ఇవ్వలేదు. రాష్ట్రంలో 8 విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి.

ప్రస్తుతం సిట్టింగ్ లు గా 23 నుండి 24 మంది అభ్యర్ధులకు మమత టిక్కెట్లు ఇవ్వలేదు. టిక్కెట్ల కేటాయింపులో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారు.నందిగ్రామ్ నుండే తాను పోటీ చేస్తానని మమత బెనర్జీ స్పష్టం చేశారు. అభ్యర్ధుల ఎంపిక కోసం టీఎంసీ నేతలు కొన్ని రోజులుగా కసరత్తు చేస్తున్నారు.

2019 లోక్ సభ ఎన్నికల సమయంలో 40.5 శాతం కోటా మేరకు మహిళలకు సీట్లిచ్చారు. ఆ ఎన్నికల్లో 17 మంది మహిళలకు ఆమె ఎంపీ టికెట్లు ఇచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios