Asianet News TeluguAsianet News Telugu

చిందేసిన టీఎంసీ మహిళా ఎంపీలు: ఆషే మా దుర్గా షే అంటూ దుమ్ముధుళిపిన నటులు

తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి తొలిసారిగా లోక్ సభకు ఎంపికయ్యారు నుస్రత్‌ జహాన్‌, మిమి చక్రవర్తి. సినీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటులు రాజకీయాల్లో ఇలా అడుగుపెట్టారో లేదో అలా వివాదాలతోనే నెట్టుకొస్తున్నారు. 

tmc mps nusrat jahan & mimi chakravarty dance durga puja theme song
Author
West Bengal, First Published Sep 20, 2019, 10:00 PM IST

పశ్చిమబెంగాల్: ఇటీవల కాలంలో మీడియాలో హల్ చల్ చేస్తున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ యువ ఎంపీలు, నటులు నుస్రత్ జహాన్, మిమి చక్రవర్తిలు మరోసారి సోషల్ మీడియాలో హల్ చల్ చేశారు. ఆషే మా దుర్గా షే టైటిల్ తో ఉన్న పాటకు డ్యాన్స్ చేస్తూ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తున్నారు.  

దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని దుర్గా పూజ ఉత్సవాల ప్రధాన్యతను తెలిపే థీమ్‌ సాంగ్‌ కు నృత్యం చేస్తూ అదరహో అనిపించారు. ఈ సాంగ్ ను టీఎంటీ బార్ కంపెనీ విడుదల చేసింది. 

టీఎంటీ బార్‌ కంపెనీ రిలీజ్‌ చేసిన ఈ సాంగ్‌లో ఇద్దరు ఎంపీలు దుర్గా మాతను పూజిస్తూ డాన్స్‌ చేశారు. యువ ఎంపీలు నుస్రత్ జహాన్, మిమి చక్రవర్తిలతోపాటు మరో ప్రసిద్ధ బెంగాలీ నటి శుభశ్రీ గంగూలి కూడా ఆడిపాడారు. 

ఆషే మా దుర్గా షే టైటిల్‌తో ఉన్న ఈ పాటకు ఇంద్రదీప్‌ దాస్‌ గుప్తా సంగీతం అందించగా బాబా యాదవ్‌ కొరియోగ్రాఫ్‌ చేశారు. ప్రస్తుతం ఈ పాట ఇంటర్నెట్‌లో దుమ్ము రేపుతోంది. ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన ఈ పాట ఇప్పటికే 6 మిలియన్‌ వ్యూస్‌ సైతం సంపాదించింది. 

తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి తొలిసారిగా లోక్ సభకు ఎంపికయ్యారు నుస్రత్‌ జహాన్‌, మిమి చక్రవర్తి. సినీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటులు రాజకీయాల్లో ఇలా అడుగుపెట్టారో లేదో అలా వివాదాలతోనే నెట్టుకొస్తున్నారు. 

అతి చిన్న వయసులోనే పార్లమెంటుకు ఎన్నికయ్యి రికార్డు సృష్టించిన వీరు ప్రతి నిత్యం ఏదో ఓ వార్తతో హల్ చల్ చేస్తున్నారు. ఇకపోతే ఇద్దరు ఎంపీలలో నుస్రత్‌ జహాన్‌ ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారు. 

ఎంపీగా గెలిచిన తర్వాత నుస్రత్ జహాన్ లోక్ సభలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఆమె హిందూ సంప్రదాయ పద్ధతిలో నుదట సింధూరం, చీర ధరించి హాజరై విమర్శల పాలయ్యారు.  

ఎన్ని విమర్శలు ఎదురైనా నుస్రత్ మాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతారు. తాజాగా ఈ యువ ఎంపీలు మరోసారి వార్తాల్లో నిలిచారు. పశ్చిమ బెంగాల్‌లో దసరా నవరాత్రి ఉత్సవాలు ఎంత ఘనంగా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం బెంగాల్‌ ప్రజలు దుర్గా పూజ కోసం సిద్ధమవుతున్నారు. మెుత్తానికి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియోకు మాత్రం మంచి రెస్పాన్స్ వస్తుంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios