గవర్నర్ జగ్ దీప్ దన్ ఖర్‌ను తప్పించాలంటూ లోక్ సభలో (lok sabha ) డిమాండ్ చేసిన తృణమూల్ కాంగ్రెస్ (trinamool congress) ఎంపీ సౌగతారాయ్‌కు (sougata roy) ఊహించని షాక్ తగిలింది. పార్లమెంట్‌లో బడ్జెట్ (parliament budget session 2022) ప్రవేశపెట్టిన రోజున జరిగిన ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో గవర్నర్ vs మమతా అన్నట్లుగా పరిస్ధితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో జోక్యం చేసుకుంటూ గవర్నర్ జగ్‌దీప్ దన్‌ఖర్ (Governor Jagdeep Dhankhar).. మమత సర్కార్‌కు (CM Mamata Banerjee) కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ జగ్ దీప్ దన్ ఖర్‌ను తప్పించాలంటూ లోక్ సభలో (lok sabha ) డిమాండ్ చేసిన తృణమూల్ కాంగ్రెస్ (trinamool congress) ఎంపీ సౌగతారాయ్‌కు (sougata roy) ఊహించని షాక్ తగిలింది. పార్లమెంట్‌లో బడ్జెట్ (parliament budget session 2022) ప్రవేశపెట్టిన రోజున జరిగిన ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (nirmala sitaraman) బడ్జెట్ ప్రసంగం ముగించిన తర్వాత ప్రధాని (narendra modi).. ప్రతిపక్ష సభ్యులు ఆసీనులైన బెంచీల వైపు వెళ్లి అందరినీ అప్యాయంగా పలకరించారు. ఆ సమయంలో తృణమూల్ ఎంపీ సౌగతారాయ్ స్పందించారు. దయచేసి బెంగాల్ గవర్నర్‌ను తప్పించండి. ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారని సౌగత్ రాయ్ ప్రధానిని కోరారు. దీనికి ప్రధాని నరేంద్రమోదీ స్పందిస్తూ.. ఆప్ రిటైర్ హో జాయే తబ్ దేఖ్కే హైన్ (ముందు మీరు రిటైర్ అయితే ఆ తర్వాత దాన్ని పరిశీలిస్తాం) అని బదులిచ్చారు. దీనిపై సౌగతా రాయ్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. నేను రాజీనామా చేయాలని ప్రధాని కోరుకుంటున్నారా? ఆ తర్వాత నా అభ్యర్థనను పరిశీలిస్తారా..? లేక నేను రాజీనామా చేస్తే గవర్నర్ చేయాలనుకుంటున్నారా? అన్నది నాకు తెలియడం లేదన్నారు.
కాగా.. కొద్దిరోజుల క్రితం తన ట్విట్టర్ అకౌంట్‌లో గవర్నర్ జగదీప్ ధన్కర్‌ను బ్లాక్(Twitter Account Block) చేసినట్టు వెల్లడించారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. కొన్నేళ్లుగా వీరి మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి. కానీ, ఇటీవలే పశ్చిమ బెంగాల్ ప్రజాస్వామ్యానికి ఒక గ్యాస్ చాంబర్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ వ్యాఖ్యలు వారి మధ్య విభేదాలను పరాకాష్టకు తీసుకెళ్లాయి. ఈ తరుణంలోనే సీఎం మమతా బెనర్జీ ఆయన ట్విట్టర్ అకౌంట్‌ను బ్లాక్ చేశారు.
‘నేను అడ్వాన్స్‌గా క్షమాపణలు చెబుతున్నాం. కానీ, ఆయన(జగదీప్ ధన్కర్) ప్రతి రోజూ ఏదో వంకతో మమ్మల్ని, మా అధికారులను దూషిస్తున్నారు. రాజ్యాంగానికి విరుద్ధమైన, అనైతికమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన సూచనలు చేయరు. ఏకంగా ఆదేశాలే ఇస్తుంటారు. ఎన్నుకున్న ప్రభుత్వమే వెట్టి కూలీగా మారింది. అందుకే నా ట్విట్టర్ అకౌంట్ నుంచి ఆయనను బ్లాక్ చేశాను. ఈ వ్యవహారంతో నేను ఇర్రిటేట్ అవుతున్నాను’ సీఎం మమతా బెనర్జీ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
‘నేను చాలా సార్లు పీఎం మోడీకి లేఖలు రాశాను. ఆ గవర్నర్ అసలు వినడు, ఎవరిని పడితే వారిని బెదిరిస్తూ ఉంటారు. నేరుగా ఆయన వద్దకు వెళ్లి కూడా ఈ విషయంపై మాట్లాడాను’ అని వివరించారు. గతేడాది కూడా తాము ఆ గవర్నర్‌ను భరించామని అన్నారు. ఆయన చాలా ఫైళ్లను క్లియర్ చేయలేదని, వాటిని అలాగే పెండింగ్‌లో పెడుతున్నాడని ఆరోపించారు. ఆయన విధానపరమైన నిర్ణయాల గురించి ఎలా మాట్లాడతారు? అని ప్రశ్నించారు. గవర్నర్ విషయమై తాను ప్రధాని మోడీకి కనీసం నాలుగు లేఖలైనా రాశానని తెలిపారు.
