Asianet News TeluguAsianet News Telugu

టీఎంసీకి షాక్: ఎంపీ సంతన్ సేన్ రాజ్యసభ నుండి సస్పెన్షన్

 రాజ్యసభ నుండి టీఎంసీ ఎంపీ సంతసేన్ ను సస్పెండ్ చేశారు. వర్షాకాల సమావేశాలు పూర్తయ్యే వరకు ఆయనపై సస్పెన్షన్ ను విధించారు. గురువారం నాడు రాజ్యసభలో ఐటీ మంత్రి ప్రకటన చేసే సమయంలో  ఐటీ మంత్రి వద్ద పత్రాలను సేన్ చించివేశారు. 

TMC MP Santanu Sen, who snatched and tore IT Minister's Pegasus statement, suspended from Rajya Sabha lns
Author
New Delhi, First Published Jul 23, 2021, 12:15 PM IST

న్యూఢిల్లీ: రాజ్యసభ నుండి టీఎంసీ ఎంపీ సంతస్ సేన్ ను సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేశారు. గురువారం నాడు రాజ్యసభలో చోటు చేసుకొన్న పరిణామాలపై ఛైర్మెన్ వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను మనోవేదనకు గురి చేసిందన్నారు. మంత్రి నుండి పత్రాలను చింపి ముక్కలు ముక్కలు చేయడం సరైంది కాదన్నారాయన.  ఈ రకమైన చర్యలు పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై దాడి ఆయన అభివర్ణించారు. సభ నుండి వెళ్లిపోవాలని  టీఎంసీ ఎంపీని ఛైర్మెన్ కోరారు. సభ కార్యక్రమాలను కొనసాగించేందుకు సహకరించాలని కోరారు.

గురువారం నాడు  పెగాసెస్ అంశంపై  రాజ్యసభలో ఐటీ మంత్రి ఆశ్విని వైష్ణవ్  నుండి పత్రాలను లాక్కొని టీఎంసీ ఎంపీ సేన్ చింపివేశారు.పెగాసెస్ దేశంలోని జర్నలిస్టులు, కేంద్రమంత్రులు, విపక్ష పార్టీలకు చెందిన కీలక నేతల ఫోన్లను  హ్యాక్ చేశారని మీడియాలో  వార్తలు వెలువడ్డాయి. దీంతో  పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాలు ఈ అంశంపై చర్చకు డిమాండ్ చేశాయి.

Follow Us:
Download App:
  • android
  • ios