బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ తో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సగుతా రాయ్ డ్యాన్స్ వేశారు. కోల్ కతాలో గురువారం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి రవీనా టాండన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్టేజీపై రవీనా టాండన్ డ్యాన్స్ చేశారు.

తనతోపాటు ఎంపీ సగుతా రాయ్ ని కూడా డ్యాన్స్ చేయాల్సిందిగా కోరారు. 1994లో విడుదలైన హిట్ సినిమా మోహ్రాలోని  తూ చీజ్ బడీ హై మస్త్  పాటకు వారిద్దరూ డ్యాన్స్ వేశారు. ఇతర నేతలు కూడా వీరితో కలిసి కాసేపు స్టెప్పులు వేశారు. కాగా.. 70 ఏళ్ల వయసులో కూడా ఇంత జోష్ గా ఉండే వ్యక్తిని తానెప్పుడూ చూడలేదని. సగుతా రాయ్ నిజంగా చాలా స్పోర్టివ్ పర్సన్ అంటూ రవీనా ఎంపీపై పొగడ్తల వర్షం కురిపించారు.