ప్రముఖ బెంగాలీ నటి, టిఎంసి ఎంపీ మిమీ చక్రవర్తి ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రయాణ సమయంలో ఆమెకు అందించిన ఆహారంలో వెంట్రుకలు వచ్చాయి. ఆ తర్వాత ఈ విషయంపై ఎయిర్‌లైన్స్‌కు మెయిల్ చేస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రముఖ బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) ఎంపి మిమీ చక్రవర్తి ఎమిరేట్స్ విమానయాన సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె ఇటీవల ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానంలో ప్రయాణించింది. అయితే.. ఈ సమయంలో ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ప్రయాణ సమయంలో తనకు ఇచ్చిన ఆహారంలో ఊహించని విధంగా వెంట్రుకలు వచ్చాయి. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైంది. తీవ్ర అసంత్రుప్తి వ్యక్తం చేస్తూ.. ఎయిర్‌లైన్స్‌పై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన తర్వాత .. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ ఏమీ చేయలేదని మిమీ చక్రవర్తి పేర్కొన్నారు. ఈ విషయంలో ఎయిర్ లైన్స్ నుంచి ఎలాంటి స్పందన రాలేదని.. సోషల్ మీడియా వేదికగా ఎయిర్ లైన్స్ తీరుపై మండిపడింది.
నటి , TMC ఎంపీ చక్రవర్తి ట్వీట్ చేస్తూ.. ఆమెకు అందించిన ఆహారం, జుట్టు చిత్రాలను పంచుకుంది. “డియర్ ఎమిరేట్స్, మీ విమానంలో ప్రయాణిస్తున్న వ్యక్తుల గురించి మీరు ఆందోళన చెందాలని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. నేను ఈ విషయం గురించి మీకు మరియు మీ బృందానికి కూడా మెయిల్ చేసాను, కానీ మీరు ప్రత్యుత్తరం ఇవ్వడం లేదా క్షమాపణ చెప్పడం అవసరం అని భావించలేదు. రోజుల్లో మీతో ప్రయాణిస్తున్న వ్యక్తుల మంచి, చెడులను మీరు మరచిపోయారు. ఆహారంలో జుట్టు రాసుకోవడం మంచిది కాదని మీకు కూడా తెలుసు. మీరు ప్రయాణీకుల గురించి ఆందోళన ఉంటే.. నా మెయిల్‌కు మీరు స్పందించి ఉంటేవారని అన్నారు. ఒక్కటే ప్రశ్న.. స్వయంగా ఓ ఎంపీ మెయిల్ చేస్తే.. సమాధానం రాలేదు. అలాంటప్పుడు సామాన్యుడి పరిస్థితి ఏంటి? మేము సమాధానాల కోసం చూస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ స్పందనేంటీ?
చక్రవర్తి ట్వీట్ వైరల్ కావడంతో ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ స్పందించింది. దీనికి క్షమాపణలు కోరుతూ, దయచేసి ఫీడ్‌బ్యాక్‌ను మాకు పంపండి . మొత్తం విషయంపై ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయండి. దీని తర్వాత కస్టమర్ రిలేషన్ టీమ్ దానిని సమీక్షిస్తుందని తెలిపింది. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ మొత్తం సమస్యకు సంబంధించి మిమీ చక్రవర్తి DMని వివరణ కోరారు. మిమీ చక్రవర్తి పశ్చిమ బెంగాల్‌లోని జాదవ్‌పూర్ స్థానం నుండి ఎంపీ గా గెలుపొందారు. ఆమె బెంగాలీ సినిమాలతో పాటు..టెలివిజన్‌లో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
