దేశ ఆర్ధిక రాజధాని ముంబైని వర్షాలు వదలడం లేదు. దాదాపు ఐదు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మహానగరం జలసంద్రమయ్యింది. దీంతో శిథిలావస్థలో ఉన్న భవనాలు, గోడలు కూలి ఇప్పటికే మహారాష్ట్రలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు.

ఈ క్రమంలో రత్నగిరిలోని తివారి ఆనకట్టకు పడి సమీపంలోని గ్రామాలను వరద నీరు ముంచెత్తింది. ఈ  ఘటనలో ఇద్దరు మరణించగా... 23 మంది గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను వెలికి తీశారు. వరద ఉద్ధృతికి 12 ఇళ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. మరిన్ని వివరాలు అందాల్సి వుంది.