తన ఎంగేజ్మెంట్ ఫోటోలను షేర్ చేసిన ఆమె.. తనకు కాబోయే భర్త 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ప్రదీప్ గవాండే అని తెలిజేసింది. అతనిని కూడా ఫోటోల్లో ట్యాగ్ చేయడం గమనార్హం.
ఐఏఎస్ అధికారిణని టీనా దాబీ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఆమె పేరు వినగానే.. తాను ఓ ఐఏఎస్ టాపర్ అని, తనతో పాటే టాప్ గా నిలిచిన మరో అధికారి అథర్ అమీర్ ఖాన్ ని పెళ్లి చేసుకున్న విషయం.. ఆయనతో విడిపోయిన విషయం ఇలా అన్నీ హాట్ టాపిక్ గా మారినవే. కాగా.. ఆమె మరోసారి వార్తల్లో నిలిచారు. టీనా దాబీ మళ్లీ పెళ్లికి సిద్ధమయ్యారు. ఆమె ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

ఆమె రెండో పెళ్లి కూడా మరో ఐఏఎస్ అధికారి నే చేసుకోవడం గతమనార్హం. తన ఎంగేజ్మెంట్ ఫోటోలను షేర్ చేసిన ఆమె.. తనకు కాబోయే భర్త 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ప్రదీప్ గవాండే అని తెలిజేసింది. అతనిని కూడా ఫోటోల్లో ట్యాగ్ చేయడం గమనార్హం.
టీనా దాబీకి సోషల్ మీడియాలో దాదాపు 1.4 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉండటం గమనార్హం. కాగా.. ఆమె పెట్టిన పోస్టుపై సోషల్ మీడియాలో అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆమెకు కాబోయే భర్త , ఐఏఎస్ అధికారి మిస్టర్ గవాండే కూడా వారి ఎంగేజ్మెంట్ కు సంబంధించిన రెండు చిత్రాలను కూడా పంచుకున్నారు, ఆ ఫోటోలో వారు చేతులు పట్టుకొని ఉన్నారు.
కాగా.. టీనా దాబీ2018లో తాను వివాహం చేసుకున్న అథర్ అమీర్ ఖాన్‌తో గత ఏడాది చివర్లో విడాకులు తీసుకుంది. ఈ వివాహానికి ప్రముఖ రాజకీయ నాయకులు హాజరయ్యారు.
టీనా దాబీ 2015లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్షలో అగ్రస్థానంలో నిలిచింది, అదే సంవత్సరం అథర్ ఖాన్ రెండవ స్థానంలో నిలిచారు. వారి ప్రేమ, వివాహం సినిమా రేంజ్ లో ఉంటుంది.
ఢిల్లీలోని లేడీ శ్రీ రామ్ కాలేజ్‌లో గ్రాడ్యుయేట్ అయిన దాబీ, ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసెస్ పరీక్షలో టాపర్ గా నిలిచిన మొదటి దళితురాలిగా నిలిచారు. అంతేకాకుండా.. ఆమె ఫస్ట్ అటెంప్ట్ లోనే ఆమె టాప్ గా నిలవడం గమనార్హం.
ఢిల్లీలో జరిగిన వీరి వివాహ రిసెప్షన్‌కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రులు, అప్పటి లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ హాజరయ్యారు. వీరి పెళ్లి అప్పట్లో ఎంత హాట్ టాపిక్ గా మారిందో... తర్వాత వారి విడాకుల విషయం కూడా అంతే హాట్ టాపిక్ అయ్యింది. కాగా.. ఇప్పుడు ఆమె మరో పెళ్లి చేసుకోవడం.. ఇప్పుడు అందరి దృష్టి ఆకర్షించింది.
