Asianet News TeluguAsianet News Telugu

బావగారు ముఖేష్ అంబానీకి... టీనా అంబానీ స్పెషల్ బర్త్ డే విషెస్

ఆమె పెట్టిన పోస్టు ఇప్పుడు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆ పోస్టుకి లైకుల వర్షం కురుస్తోంది. చాలా మంది బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. 
 

Tina Ambani's Birthday Post For Brother-In-Law Mukesh Ambani
Author
Hyderabad, First Published Apr 20, 2021, 9:06 AM IST

భారత దేశంలోని అత్యంత సంపన్నుల్లో ఒకరు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షల వర్షం కురుస్తోంది. కాగా..  ముకేష్ అంబానీకి.. ఆయన సోదరుడు అనీల్ అంబానీ భార్య టీనా అంబానీ సైతం స్పెషల్ బర్త్ డే విషెస్ తెలియజేశారు.

ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన ఆమె.. ముకేష్ అంబానీకి విషెస్ తెలియజేశారు. ‘ లవ్వింగ్ సన్, బ్రదర్, బ్రదర్ ఇన్ లా, అడోరింగ్ ఫాదర్, గ్రాండ్ ఫాదర్’’ అంటూ ఆమె క్యాప్షన్ ఇచ్చారు.  మీరు ఎల్లప్పుడూ సంతోషంగా.. ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆమె తన పోస్టులో పేర్కొన్నారు.  ముకేష్ అంబానీ తో కలిసి దిగిన ఫోటోలను కూడా ఆమె షేర్ చేశారు. అందులో.. అనిల్ అంబానీ కూడా ఉన్నారు. మరో ఫోటోలో ముకేష్ తో టీనా యంగ్ లుక్ లో ఉన్న ఫోటో కూడా ఉంది. 

ఆమె పెట్టిన పోస్టు ఇప్పుడు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆ పోస్టుకి లైకుల వర్షం కురుస్తోంది. చాలా మంది బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. 

 

ఇటీవల ముకేష్ అంబానీ, నీతా అంబానీ పెళ్లి రోజు సందర్భంగా కూడా.. టీనా అంబానీ స్పెషల్ విషెస్ తెలియజేశారు. 

కాగా.. ముకేష్ అంబానీ ఈ రోజు తన 64వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. ఆయనకు పలువురు ప్రముఖుల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 

ప్రముఖ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ దబూ రత్నాని కూడా ముకేష్ అంబానీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ హ్యాపీ బర్త్ డే ముకేష్ భాయ్’ అంటూ ముకేష్ తో కలిసి దిగిన సెల్ఫీని షేర్ చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios