దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. 7 దశల్లో జరిగిన ఎన్నికలు నేటితో ముగియడంతో ఎగ్జిట్ పోల్ ఫలితాలని వివిధ సంస్థలు వెల్లడించడం ప్రారంభిస్తున్నాయి. తాజాగా టైమ్స్ నౌ, విఎంఆర్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఈ సారి కూడా కేంద్రంలో మోడీనే ప్రధాని అని తేల్చింది. ఎన్డీయే దేశవ్యాప్తంగా 306 సీట్లని కైవసం చేసుకోబోతున్నట్లు టైమ్స్ నౌ సంస్థ సర్వేలో తెలిపింది. ఏపీలో వైఎస్ జగన్ వైసిపి పార్టీ 18 పార్లమెంట్స్ స్థానాల్లో జయకేతనం ఎగరవేయనున్నట్లు పేర్కొంది. 

పార్లమెంట్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు: 

ఎన్డీయే: 306

యుపిఏ : 132

ఇతరులు: 104

వివిధ రాష్ట్రాల్లో ఇలా.. 

గుజరాత్ 

బిజెపి: 23

కాంగ్రెస్: 03

ఇతరులు: 0

కేరళ 

యూడీఎఫ్: 15

బిజెపి+: 01

ఎల్డిఎఫ్ : 04

తెలంగాణ 

టిఆర్ఎస్ : 13

కాంగ్రెస్ : 02

బిజెపి : 01

ఏఐఎంఐఎం: 01

ఆంధ్ర ప్రదేశ్ 

టిడిపి: 07

వైసిపి : 18

ఇతరులు : 0

తమిళనాడు 

కాంగ్రెస్+: 29

బిజెపి+: 09

ఇతరులు : 0

మధ్య ప్రదేశ్ 

కాంగ్రెస్: 05

బిజెపి:24

ఇతరులు: 0

బీహార్ 

కాంగ్రెస్+: 10

బిజెపి+: 30

ఇతరులు: 0

ఉత్తర్ ప్రదేశ్ 

కాంగ్రెస్+: 02

బిజెపి+: 58

ఎస్పీ-బీఎస్పీ: 20

ఇతరులు: 0

వెస్ట్ బెంగాల్ 

కాంగ్రెస్: 02

బీజేపీ : 11

ఏఐటిసి: 28

ఎల్ఎఫ్: 01

ఇతరులు: 0

దేశంలోని 542 స్థానాలకు ఏడు విడతల్లో పోలింగ్ జరిగింది. చివరి విడత పోలింగ్ ఆదివారం ముగిసింది. ఆ తర్వాత ఆదివారం సాయంత్రం వివిధ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను వెలువరిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు ఈ నెల 23వ తేదీన వెలువడనున్నాయి.