అమరవీరుల త్యాగాలను దేశం ఎప్పటికీ మరిచిపోదని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చెప్పారు. త్రివిధ దళాలు, పోలీసులు అన్ని సమయాల్లో సమర్థవంతంగా పనిచేస్తున్నారని రాష్ట్రపతి కోవింద్ ప్రశంసించారు.

న్యూఢిల్లీ: అమరవీరుల త్యాగాలను దేశం ఎప్పటికీ మరిచిపోదని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చెప్పారు. త్రివిధ దళాలు, పోలీసులు అన్ని సమయాల్లో సమర్థవంతంగా పనిచేస్తున్నారని రాష్ట్రపతి కోవింద్ ప్రశంసించారు.

72వ,స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజలకు ఆయన స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రైతులకు సాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. మహిళలకు పురుషులతో సమానంగా అవకాశాలు కల్పించాలన్నారు. 

సరిహద్దుల్లో జవాన్లు ప్రాణాలు పణంగా పెట్టి దేశాన్ని రక్షిస్తున్నారు. దేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది. సంక్షేమ పథకాలు అందరికీ అందేలా కృషి చేస్తున్నట్టు చెప్పారు.